ఈటెలపై మరో కేసు నమోదు

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై మరో కేసు నమోదు అయ్యింది. ఆయన కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అంటూ కేసు నమోదు చేయడం జరిగింది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో భాగంగా ఈటెల రాజేందర్‌ క్షణం తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆ సమయంలో కొన్ని సార్లు కోవిడ్ నిబంధనల ఉల్లంఘన జరుగుతోంది. ఇతర పార్టీల వారు ఎన్నికల ప్రచారం నిర్వహించిన సమయంలో కూడా అది జరుగుతుంది అనేది సాదారణ జనాల అభిప్రాయం.

ఈటెల రాజేందర్ మీటింగ్‌ పై ప్లైయ్యింగ్ స్కాడ్స్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈటెలపై కేసును నమోదు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే భూ అక్రమణల పేరుతో ఈటెలపై ఫిర్యాదులు ఉన్నాయి. కనుక ఈటెలపై ఈ కేసు ఆయనన్ను మరింతగా ఇరుకున పెట్టేలా ఉంది అంటూ టాక్ వినిపిస్తుంది. పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్నా కొద్ది ఈటెలపై ప్రజల్లో సానుభూతి వ్యక్తం అవుతుంది అంటూ మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్‌ ఎన్నికల్లో ఈటెల గెలుపు ఖాయం అంటూ బీజేపీ నాయకత్వం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.


Recent Random Post: