దిల్ రాజుకు గట్టి పోటీ ఇవ్వబోతున్న మాజీ స్నేహితుడు

టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజుకు మెల్ల గా సమస్యలు చుట్టు ముడుతున్నట్లుగా అనిపిస్తుంది. నిర్మాతగా ఎంత బిజీగా ఉన్నా కూడా పెద్ద సినిమాలను క్రేజీ సినిమాలను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నాడు. పెద్ద సినిమాలు అంటే దిల్ రాజు అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. నైజాం ఏరియాలో దిల్ రాజు ఎంత అంటే అంత అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కాని ఇప్పుడు అలా కాదు. ఇప్పటికే వరంగల్ శ్రీను గట్టి పోటీని దిల్ రాజుకు ఇస్తుంటే ఇప్పుడు ఆయన మాజీ మిత్రుడు లక్ష్మణ్‌ కూడా రంగంలోకి దిగాడు.

దిల్ రాజు తో గతంలో పలు సినిమాలను నిర్మించి డిస్ట్రిబ్యూట్‌ చేసిన లక్ష్మణ్‌ కొన్ని కారణాల వల్ల సొంత బ్యానర్‌ ను షురూ చేయడం జరిగింది. తన డిస్ట్రిబ్యూషన్‌ లో మొదటి సినిమాగా జాతి రత్నాలను లక్ష్మణ్‌ విడుదల చేశాడు. జాతి రత్నాలు ఏ రేంజ్లో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లక్ష్మణ్‌ మొదటి ప్రాజెక్ట్‌ భారీ లాభాలను తెచ్చి పెట్టడంతో ముందు ముందు పెద్ద సినిమాలను ఆయన తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. దిల్ రాజుకు మరింత పోటీ ని ఆయన ఇస్తాడని అంటున్నారు.


Recent Random Post: