యువనేత కోసం కేసీఆర్ కోర్టుకు వెళ్తారా..? మహారాష్ట్ర సీన్ రిపీట్ అవుతుందా..?

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ తీరు, గవర్నర్ నిర్ణయం మింగుడుపడకుండా చేస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ తనకే అని సంచలనం రేపిన ఆయనకు సీఎం కేసీఆర్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫైల్ ను గవర్నర్ ఆమోదానికి పంపించారు. అయితే.. గవర్నర్ తమిళసై మాత్రం.. పెండింగ్ లో పెట్టారు.

ఓపక్క హుజూరాబాద్ ఎన్నిక దగ్గరకొస్తోంది. గవర్నర్ కూడా ఫైల్ వెనక్కి పంపడం లేదు. వెనక్కి పంపిస్తే.. మళ్లీ కౌశిక్ నే క్యాబినెట్ ప్రతిపాదిస్తూ ఫైల్ పంపితే గవర్నర్ ఆమోదించాలి. ఈ నేపథ్యంలో ఫైల్ లో కదలిక లేకపోయింది. మహారాష్ట్రలో కూడా ఇదే పరిస్థితి ఎదురై 12 మంది ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. మరి.. కేసీఆర్ ఒక్క ఎమ్మెల్సీ కోసం కోర్టుకు వెళ్తారా.. కౌశిక్ కల నెరవేరుస్తారా..? అనేది తేలాల్సి ఉంది.


Recent Random Post: