చిరంజీవి మెగా నట ప్రస్థానం.. కెమెరా ముందుకొచ్చి నేటికి 43 ఏళ్లు

కొణిదెల శివశంకర వర ప్రసాాద్ గా సినీ పరిశ్రమకు వచ్చి మెగాస్టార్ గా చిరంజీవి ఎదిగిన ప్రస్థానం గురించి తెలిసిందే. తెలుగు సినిమాల్లో డ్యాన్స్, ఫైట్స్, కామెడీ.. లో మెగాస్టార్ తనదైన ప్రత్యేక ముద్ర వేసి దశాబ్దాలుగా ప్రేక్షకాభిమానుల్ని అలరిస్తున్నారు. తొలి సినిమా విడుదలైన 1978 సెప్టెంబర్ 28కి ఆయన సినీ జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఉందో.. 1978 ఫిబ్రవరి 11కి అంతే ప్రాముఖ్యత ఉంది. చిరంజీవి తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చిన రోజు ఇది. నేటితో ఆయన ప్రస్థానం మొదలై 43 ఏళ్లు పూర్తయ్యాయి.

దీంతో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంబరాలు జరుపుకుంటున్నారు. పునాదిరాళ్లు సినిమాతో చిరంజీవి కెమెరా మందుకు వచ్చారు. అయితే.. ఆయన రెండో సినిమా ‘ప్రాణం ఖరీదు’ తొలిగా 1978 సెప్టెంబర్ 28న విడుదలైంది. ఇన్నేళ్ల సినీ జీవితంలో చిరంజీవి మెరిపించిన మెరుపులెన్నో ఉన్నాయి. మెగాస్టార్ గా తెలుగు సినిమాకు అప్రతిహత నెంబర్ వన్ హీరోగా చిరంజీవి ఇప్పటికీ కొనసాగుతున్నారు. తెలుగు సినిమాకు సరికొత్తగా కమర్షియల్ హంగులు అద్దిన హీరోగా చిరంజీవి కీర్తిని ఆర్జించారు.


Recent Random Post: