ఆమె అనుకుంది అంతే.. బొక్క బోర్లా పడ్డా: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించారు. మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఇందులో ‘సిద్ధ’ అనే బలమైన పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించబోతున్నారు. ఈయనకు జోడీగా పూజా హెగ్డే అలరించబోతోంది.

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరి కొన్ని గంటల్లోనే విడుదల కాబోతోంది. థియేటర్స్ వద్ద అప్పుడే మెగా అభిమానుల సందడి కూడా షురూ అయింది. అయితే తాజాగా ఆచార్య స్టార్ కాస్ట్ ను ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలేం జరిగిందంటే.. చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించాలనేది సురేఖ కొణిదెల కోరిక అన్న సంగతి తెలిసిందే. ఆచార్యతో ఆ కోరిక నెరవేరబోతోంది.

అయితే ఈ విషయాన్నే హరీష్ శంకర్ ఇంటర్వ్యూలో చిరు-చరణ్ లు ప్రస్తావించారు. చిరు మాట్లాడుతూ.. ‘సురేఖకు నేను చరణ్ పూర్తి స్థాయి పాత్రలతో సినిమా చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. చరణ్ హీరో అయ్యే టైమ్ కి నేను పాలిటిక్స్ లోకి వెళ్లాను.

అప్పుడామె ఎంతో బాధపడింది. నేను ఎప్పుడైతే రీ ఎంట్రీ ఇచ్చానో.. సురేఖ కోరికకు మళ్ళీ రెక్కలొచ్చాయి. ఇక ఆమె కోరుకున్నట్లే మీమిద్దరం కలిసి ఆచార్యలో నటించాం’ అంటూ చెప్పుకొచ్చారు.

ఆపై రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘అమ్మ సంకల్పం కోరికలు ఎంతో బలంగా ఉంటాయి.. ఆవిడ ఏదనుకున్నా అది జరిగిపోతుంది..’ అని అంటుండగా వెంటనే చిరు అందుకుని ‘అవును చాలా బలమైన కోరిక.. తను అనుకుంటే ఏదైనా అయిపోతుంది.

మనవూరి పాండవులు చిత్రం చూసి ఎవరీ సైకిల్ అబ్బాయి చాలా బావున్నాడే అని అనుకుందట.. అంతే ఫినిష్.. బొక్క బోర్లా పడ్డాను. ఆ టైం లో నేను అప్పుడే పెళ్లి చేసుకోకూడదు అని అనుకున్నా.. కానీ అయిపోయింది’ అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. దీంతో ఈయన వ్యాఖ్యలు కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.


Recent Random Post: