ఏపీ: అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై టీడీపీ కీలక నిర్ణయం

మార్చి 7వ తేదీ నుంచి జరుగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన టీడీఎల్పీ సమావేశంలో నిర్ణయించారు. బడ్జెట్ పై చర్చకు సభలకు హాజరు కావడమే మంచిదన్న యనమల రామకృష్ణుడు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ..

‘ప్రతిపక్ష పార్టీగా ప్రజల ఇబ్బందులను ప్రశ్నించాలనే సభకు హాజరవుతున్నాం. సమవేశాలకు రాకుండా పారిపోతున్నామంటున్న వైసీపీ నేతలు.. గతంలో సభకు చెప్పకుండా జగన్ వెళ్లిపోయిన విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. గతంలో సభలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఎమ్మెల్యేలతో చర్చించి తీసుకునేవారు. మూడేళ్లుగా ప్రభుత్వం ఈ పద్ధతికి తిలోదకాలిచ్చింది. ప్రతిపక్ష సభ్యులను అవమానిస్తున్నారు. సభలో విపక్షాలకు మాట్లాడే సమయం ఇవ్వాలి.

రాజధానిపై హైకోర్టు స్పష్టంగా తీర్పిచ్చినా వైసీపీ సభ్యులకు బుద్ది రాలేదు. కొత్తగా చట్టం తీసుకువస్తామని మళ్లీ చెబుతూ ఒంటెద్దు పోకడలకు పోతున్నారు. సభలో ప్రసారాలకు అన్ని మీడియా చానెళ్లకు అనుమతి ఇవ్వాలి’ అని అన్నారు. చంద్రబాబు మినహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరుకానున్నారు.


Recent Random Post: