రెండో సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న బుచ్చి బాబు

తన తొలి చిత్రంతో బుచ్చి బాబు సెన్సేషన్ క్రియేట్ చేసాడు. దాదాపు 18 కోట్ల బడ్జెట్ తో బుచ్చి బాబు తెరకెక్కించిన ఉప్పెన చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఏకంగా 40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది ఈ చిత్రం. మరో 15 కోట్ల రూపాయలు డిజిటల్ + సాటిలైట్ రైట్స్ రూపంలో వచ్చాయి.

ఉప్పెన చిత్రం సాధించిన విజయంతో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దర్శకుడికి ఒక లగ్జరీ కార్ ను బహుమతిగా ఇచ్చారు. తొలి సినిమాతో సెన్సేషన్ సృష్టించిన బుచ్చి బాబు రెండో సినిమాతో జాక్ పాట్ కొట్టాడు.

ఏకంగా జూ. ఎన్టీఆర్ తో సినిమాను డైరెక్ట్ చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా కూడా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి ఏకంగా రూ. 10 కోట్ల రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నాడు బుచ్చి బాబు.


Recent Random Post: