బ్రహ్మానందంకు అభిమాని ‘చలాన్’ పోస్ట్


హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తాజాగా తన బర్త్ డే జరుపుకున్నారు. ఆసమయంలో ఆయన్ను కొందరు మీడియా వర్గాల వారు మరియు అభిమానులు కలిసేందుకు వెళ్లారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో తనపై వస్తున్న మీమ్స్ తనను ఉపయోగించి చేస్తున్న మీమ్స్ పట్ల ఫిదా అయ్యాడు. సినిమాల్లో నటించి నవ్వించాను ఇప్పుడు ఇలా కూడా నవ్విస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ చిన్న బైట్ ఇచ్చాడు. అది చాలా వైరల్ అయ్యింది. ఆ సమయంలో బ్రహ్మానందం కారును ఆ వీడియోలో చూపించడం జరిగింది. కొందరు నెటిజన్స్ దాన్ని రచ్చ రచ్చ చేస్తున్నారు.

సెలబ్రెటీ వాహనాలు కనిపించిన వెంటనే వాటిపై చలాన్ లు ఎంత ఉన్నాయి అనే విషయాన్ని వెంటనే తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా బ్రహ్మానందం కారు నెంబర్ ను చూసిన వారు వెంటనే చలాన్ లు చెక్ చేశారు. ఆయన కారు పై ఏకంగా 14895 రూపాయల చలాన్ లు ఉన్నట్లుగా గుర్తించారు. ఒక వ్యక్తి సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని చెప్పుకొచ్చాడు. సర్ మీ వెహికిల్ పై రూ.14895 చలాన్ ఉన్నాయి ఊరికే చెబుతున్నాను అంటూ హ్యాపీ బర్త్ డే అంటూ పోస్ట్ చేశాడు. ఇంకా పలువురు కూడా బ్రహ్మానందం కారు నెంబర్ చలాన్ విషయమై సోషల్ మీడియాలో షేర్ చేశారు. బ్రహ్మానందం గారు అంతగా చలాన్ లు పెరిగే వరకు ఏం చేస్తున్నారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


Recent Random Post: