బిగ్ బాస్ తెలుగు-5 : చిన్న విషయాలకు పెద్ద గొడవలు- ఎపిసోడ్-3

బిగ్ బాస్ సీజన్‌ 5 మెల్ల మెల్లగా గొడవల్లోకి వెళ్తోంది. బిగ్ బాస్ అంటేనే గొడవలు టాస్క్ లు రచ్చ రచ్చ ఉంటుంది. సాదారణంగా అయితే బిగ్‌ బాస్ మొదలు అయిన కొన్ని రోజుల తర్వాత గొడవలు అనేవి ప్రారంభం అవుతాయి. కాని ఈసారి గొడవలు మరీ రచ్చరచ్చ గా ఆరంభంలోనే అవుతున్నాయి. ఎపిసోడ్‌ 3 లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో ఈ గొడవల విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇలా చిల్లరగా వ్యవహరిస్తున్నారు ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే మరి కొందరు మాత్రం అబ్బ ఈసారి మొదటి నుండే రచ్చ ఉంది.. ముందు ముందు రచ్చ రచ్చ ఖాయం అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఎపిసోడ్‌ 3 లో ఒక రకమైన వాతావరణం క్రియేట్‌ అయ్యింది.

పూర్తి ఎపిసోడ్‌ వివరాల్లోకి వెళ్తే.. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా పవర్‌ రూమ్‌ టాస్క్ ను ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు బిగ్‌ బాస్ చరిత్రలో ఎప్పడు అలాంటి ప్రత్యేక రూమ్‌ లేదు. మొదటి సారి ఆ రూమ్‌ ను ఇవ్వడం ద్వారా కంటెస్టెంట్స్ లో మరింత పోటీ ని కలిగిస్తుంది అనే ఉద్దేశ్యంతో బిగ్ బాస్ నిర్వాహకులు ఆ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఆ రూమ్‌ టాస్క్ లో భాగంగా మొదట విశ్వ వెళ్లారు. ఆ తర్వాత మానస్ వెళ్లారు. ఆ రూమ్‌ లోకి వెళ్లిన వారికి ప్రత్యేక పవర్‌ ఇచ్చారు. ఆ పవర్‌ తో విశ్వ ఇంట్లో ఉన్న ఇద్దరు డ్రస్‌ లు వస్తువులు అన్ని కూడా బయటకు పంపించాల్సి ఉంటుంది. దాంతో విశ్వ ఇద్దరిగా రవి మరియు ప్రియలను ఎంపిక చేయడం జరిగింది. వారిద్దరు తమకు చెందిన వస్తువులు అన్ని కూడా బయటకు పంపించారు. ఆ తర్వాత మానస్ వెళ్లాడు. ఆ సమయంలో మానస్‌ ఎంపిక చేసిన వారు ఇంటి సభ్యులు అంతా కూడా నిద్ర పోయే వరకు నిద్ర పోకుండా ఉండాలి. ఆ టాస్క్ కు గాను కాజల్‌ ను ఎంపిక చేయడం జరిగింది.

ఇక తాజా ఎపిసోడ్‌ లో కూడా లహరి మరియు కాజల్‌ ల మద్య గొడవ జరిగింది. ఇద్దరు కూడా కిచెన్‌ విషయంలో చర్చ మొదలు పెట్టి అక్కడ నుండి ఎక్కడికో తీసుకు వెళ్లారు. ఇద్దరి గొడవ మరీ రచ్చ రచ్చ అయ్యింది. ఇద్దరి వ్యవహారంలో కూడా తప్పు ఉంది అంటూ ఇంటి సభ్యులు చెప్పుకొచ్చారు. ఇక లోబో మరియు సిరిల మద్య గొడవ జరిగినట్లుగా ప్రోమోలో చూపించారు. అది వారిద్దరు కావాలని చేసిన ఫ్రాంక్‌. ఇద్దరి పై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. సిరిని ఉద్దేశించి సరయు కాస్త సీరియస్ గానే కామెంట్స్ చేసింది. ఇంకా అనీ మాస్టర్ మరియు జెస్సీల మద్య కాస్త సీరియస్ గానే గొడవ సాగింది. కుర్చీ పై కాలు పెట్టిన జెస్సీ కాలు తీసేందుకు నిరాకరించడంతో అనీ మాస్టర్ కు కోపం వచ్చింది. దాంతో చాలా సీరియస్ అయ్యింది. జెస్సీ పై అరిచింది. అందుకు జెస్సీ కూడా సీరియస్ అయ్యాడు. ఆ మొత్తం వ్యవహారంలో ఇద్దరి తప్పు ఉన్నా కూడా జెస్సీ కి మైనస్ అయ్యింది. మొత్తంగా ఎపిసోడ్‌ 3 కొన్ని ఎమోషన్స్‌ కొన్ని గొడవలు కాస్త ఫన్‌ తో సాగింది.


Recent Random Post: