అదేంటి లిస్ట్ లో బెల్లంకొండ సినిమా లేదు?

బాలీవుడ్ లో ప్రస్తుతం దూకుడుగా సినిమాలను నిర్మిస్తోన్న, విడుదల చేస్తోన్న సంస్థ పెన్ స్టూడియోస్. ఈ సంస్థ ఆర్ ఆర్ ఆర్ ఉత్తరాది థియేట్రికల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది. అంతే కాకుండా డిజిటల్ రైట్స్ కోసం దాదాపు 500 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.

పెన్ స్టూడియోస్ తాజాగా ఒక షో రీల్ ను పోస్ట్ చేసింది. ఆర్ ఆర్ ఆర్ ను తమ బ్యానర్ ద్వారా విడుదల చేస్తోన్న ఈ సంస్థ, బెల్ బాటమ్, ఎటాక్, గంగూభాయ్ కతీయవాడి వంటి చిత్రాలను కూడా రిలీజ్ చేయబోతోంది.

అంతే కాకుండా శంకర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కనున్న అన్నియన్ చిత్ర రీమేక్ ను కూడా ఈ షో రీల్ లో వేసింది. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందనున్న ఛత్రపతి రీమేక్ మాత్రం ఈ లిస్ట్ లో లేదు. ప్రస్తుతం పెన్ స్టూడియోస్ తెరకెక్కిస్తోన్న సినిమా ఇదొక్కటే. అయినా కానీ లిస్ట్ లో నేమ్ లేకపోవడం ఏంటి?


Recent Random Post: