బాలకృష్ణ కోసం గోపీచంద్ ప్లాన్ మార్చాడా?

కొంత విరామం తరువాత నందమూరి నటసింహం బాలకృష్ణ `అఖండ`తో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. ఈ మూవీ అందించిన సక్సెస్ కారణంగా రెట్టించిన ఉత్సాహంతో వున్న బాలయ్య తన తదుపరి చిత్రాన్ని అంతే జోష్ తో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. `అఖండ` తరువాత బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ భారీ చిత్రాన్ని చేస్తున్నారు. క్రేజీ ప్రొడక్షన్ కంపనీ మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

`క్రాక్` బ్లాక్ బస్టర్ తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసిన గోపీచంద్ .. తన తాజా చిత్రాన్ని కూడా అదే స్థాయి హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. శృతిహాసన్ తొలిసారి బాలయ్యకు జోడీగా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీని లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అయితే ఇంత వరకు రెగ్యులర్ షూటింగ్ మాత్రం ప్రారంభించలేదు. కోవిడ్ కారణంగా రెగ్యులర్ షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది.

ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ముందు అనుకున్న ప్రకారం జనవరి 11 నుంచి ప్రారంభించాల్సి వుంది కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ ప్లాన్ ని దర్శకుడు మార్చినట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కి సంబంధించి ఓ అప్ డేట్ బయటికి వచ్చేసింది. మారిన ప్లాన్ ప్రకారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ఫబ్రవరి 12 నుంచి ప్రారంభించబోతున్నారట. రామోజీ ఫిల్మ్ సిటీలో తొలి షెడ్యూల్ ని అత్యంత భారీ స్థాయిలో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.

సినిమా ప్రారంభమే యాక్షన్ ఎపిసోడ్ తో మొదలు పెట్టాలని దర్శకుడు గోపీచంద్ ప్లాన్ చేశారట. ఇక్కడ యాక్షన్ సీన్స్ని పూర్తి చేసి కడపలో మరో కీలక ఘట్టాలని తెరకెక్కిస్తారట. ఇందు కోసం అక్కడ భారీ షెడ్యూల్ నే గోపీచంద్ మలినేని ప్లాన్ చేపినట్టుగా చెబుతున్నారు. `క్రాక్`లో వేట పాలెం బ్యాచ్ కి సంబంధించిన సన్ని వేశాలు సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలిచిన విషయం తెలిసిందే. బాలకృష్ణ సినిమాని కూడా వేటపాలెం నేపథ్యంలో జరిగిన యదార్ధ సంఘటనల నేపథ్యంలోనే తెరకెక్కిస్తున్నారు.

ఇందులో కూడా బాలయ్యపై చిత్రీకరించే యాక్షన్ ఘట్టాలు సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. సినిమా అంతా రాయల సీమ నేపథ్యంలో సాగుతుందని ఇందులో బాలకృష్ణ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని ఆయన మేకోవర్ కూడా చాలా కొత్తగా వుండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్ర కథ విన్న వారంతా ఈ మూవీతో బాలయ్య మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడం గ్యారంటీ అంటున్నారు.


Recent Random Post: