బిగ్‌ బాస్‌ 4: ఫినాలే మెడల్‌ పాల టాస్క్‌ లో రచ్చ.. ఈసారి అవినాష్‌, సోహెల్‌, అఖిల్‌

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 ఫైనల్‌ రేస్‌ మొదలైంది. ఈ వారంలోనే ఒకరు ఫైనల్‌కు వెళ్లే అవకాశంను దక్కించుకుంటారు అంటూ బిగ్‌ బాస్‌ ప్రకటించాడు. ఫినాలే మెడల్‌ కోసం పాల టాస్క్‌ ను బిగ్‌ బాస్‌ ఇచ్చాడు. గార్డెన్‌ ఏరియాలో ఉన్న ఆవు నుండి వచ్చే పాలను ఎవరు ఎక్కువగా సేకరిస్తే వారు విన్నర్‌ అంటూ బిగ్‌ బాస్‌ ప్రకటించాడు. ఈ టాస్క్‌ చాలా రసవత్తరంగా సాగబోతుంది. ఎందుకంటే ఇది ఫినాలే మెడల్‌ కోసం.. ఇందులో నెగ్గిన వారు ఫైనల్‌ ఎపిసోడ్‌ వరకు అంటే టాప్‌ 5 లో ఉంటారు. రాబోయే రెండు వారాల ఎలిమినేషన్‌ ను దాటుకునే అవసరం ఆందోళన ఈ మెడల్‌ దక్కించుకున్న వారికి లేదు.

ఈ టాస్క్‌ ఫిజిల్‌ అవుతుందని అంతా అనుకున్నట్లుగానే ఫిజిల్‌ అవుతుంది. ఒకరిపై ఒకరు పడుతూ కాస్త సీరియస్‌గానే ఆడారు. ముఖ్యంగా అవినాష్‌ చావో రేవో అన్నట్లుగా పోరాడాడు. నిన్నటి ఎపిసోడ్‌ లో మోనాల్‌ అన్న మాటలకు బాగా హర్ట్‌ అయ్యాడా లేదంటే ప్రేక్షకులు తనను తిరష్కరించారనే ఆవేదనతో అలా ఆవేశంతో ఊగిపోయాడో తెలియదు కాని అవినాష్‌ మాత్రం పాల టాస్క్‌ లో ఓ రేంజ్‌ లో రెచ్చి పోయాడు. ఇదే సమయంలో సోహెల్‌ మరియు అఖిల్‌ లు కూడా ఫిజికల్‌ గా చాలా ఎఫర్ట్‌ పెట్టారు.

ఒకానొక సమయంలో అవినాష్‌ మరియు సోహెల్‌ లకు తీవ్రమైన గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త సీరియస్‌ అవ్వడంతో ఇద్దరు కొట్టుకుంటారా అన్నట్లుగా ముందుకు వచ్చారు. చివరకు మళ్లీ ఎప్పటిలాగే సోహెల్‌ కూల్‌ అయ్యాడు. అవినాష్‌ కు అరటి పండు ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కాని అవినాష్‌ మాత్రం ఒప్పుకోలేదు. ఈ టాస్క్‌ మరెంతగా సీరియస్‌ అవుతుందో చూడాలి.


Recent Random Post: