లైవ్‌ లో అవినాష్‌ పరువు తీశారు

తెలుగు బిగ్‌ బాస్ 4 లో ప్రత్యేకమైన కంటెస్టెంట్ గా నిలిచిన ముక్కు అవినాష్‌ షో నుండి బయటకు వచ్చినప్పటి నుండి రెగ్యులర్‌ గా ఎవరితోనో ఒకరితో చిట్ చాట్‌ చేయడం ప్రత్యేక ఇంటర్వ్యూలు చేయడం చేస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అవినాష్‌ పాల్గొన్నాడు. ఆ సందర్బంగా సోహెల్‌ మరియు అఖిల్‌ లు అవినాష్‌ తో ఫ్రాంక్‌ కాల్‌ చేసి మాట్లాడారు. సోహెల్ అమ్మయి పేరు చెప్పి అవినాష్‌ ను ఇరికించే ప్రయత్నం చేశాడు.

మొదట సోహెల్‌ గొంతు మార్చి రవిలి మ్యాటర్‌ ఏం అయ్యింది అంటూ అవినాష్‌ ను ప్రశ్నించాడు. మందు కొడుతావు అంటూ అవినాష్‌ పై ఆగ్రహంగా మాట్లాడాడు. ఆ తర్వాత అఖిల్‌ మాట్లాడుతూ కూకట్ పల్లి మౌనిక మరియు స్వాతి ల విషయం ఏంటీ అంటూ ప్రశ్నించాడు. గ్యాస్ కనెక్షన్‌ కోసం మా అమ్మ నీ కోసం వెయిట్‌ చేస్తుంది అంటూ అఖిల్‌ గొంతు మార్చి మాట్లాడటంతో అవినాష్ బిత్తరపోయాడు. ఆ తర్వాత అవి ఫ్రాంక్ కాల్స్‌ అని చెప్పడంతో హమ్మయ్య అనుకున్నాడు.


Recent Random Post: