అవినాష్‌ కు నాగబాబు ‘అదిరింది’ ఆఫర్‌

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 లో అవినాష్‌ పాల్గొని మంచి పేరు తెచ్చకున్నాడు. జబర్దస్త్‌ లో ఉన్న సమయంలో కంటే ఇప్పుడు అవినాష్‌ కు ఎక్కువ పేరు వచ్చింది అనడంలో సందేహం లేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను జబర్దస్త్‌ ను వదిలేసి బిగ్ బాస్కు వెళ్లినట్లుగా గతంలో చెప్పిన అవినాష్‌ ఇప్పుడు ఆర్థికంగా మంచి లాభ పడ్డట్లుగా తెలుస్తోంది. అప్పులు తీర్చడంతో పాటు ఇంటి కోసం లోన్‌ ను పూర్తిగా తీర్చేశాడట. ఈ సంతోషంలో అవినాష్‌ కు మరో గుడ్‌ న్యూస్ కూడా అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అదిరింది కార్యక్రమం కోసం అవినాష్‌ ను తీసుకు వచ్చేందుకు నాగబాబు ప్రయత్నాలు చేస్తున్నాడట. స్టార్‌ మా నుండి ఒప్పందం రద్దు చేసుకుని వస్తే బొమ్మ అదిరింది షో లో మంచి పారితోషికంతో తీసుకునేందుకు సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. నాగబాబు బొమ్మ అదిరింది కార్యక్రమంను మరింతగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే అవినాష్ ను రంగంలోకి దించాలని భావిస్తున్నాడట.


Recent Random Post: