మిస్ శెట్టి…తగ్గేది లే…?

అనుష్క. అద్భుతమైన నటీమణి. ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ తో సత్తా చాటుకుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కనుమరుగు అయిన తరుణంలో అనుష్క ఆ లోటు తీర్చేశారు. అరుంథతి రుద్రమదేవి భాగమతి వీటిలో ఎక్కడా అసలు అనుష్క కనిపించదు క్యారక్టర్లే కళ్ల ముందు కదలాడుతాయి.

అలాగని అనుష్క వాటికే పరిమితం కాలేదు. విక్రమార్కుడు లో రవితేజాతో చేసిన రోమాన్స్ యూత్ గుండెలను గిలిగింతలు పెట్టాయి. మిర్చీలో ప్రభాస్ అనుష్క మధ్య కెమిస్ట్రీ బాగా పండిన తీరుని ఎవరైనా మరచిపోగలరా. అనుష్క బాహుబలిలో ప్రభాస్ రానాతో పాటు మరో పిల్లర్ గా నిలిచి ఆ మూవీ బ్లాక్ బస్టర్ కావడానికి తన వంతు పాత్ర పోషించారనే చెప్పాలి.

అయితే అనుష్క 2015లో చేసిన జీరో సైజ్ మూవీ లో పాత్ర కోసం వెయిట్ ని బాగా పెంచేశారు. ఆ మూవీ ఫట్ అయింది కానీ హెవీ వెయిట్ తో అనుష్క కెరీర్ కూడా డల్ అయింది. ఈ మధ్యలో ఆమె ఎంత తగ్గాలని చూసినా తగ్గేదేలే అంటోంది వెయిట్. దాంతో అనుష్క సినిమాలు కూడా తగ్గాయి.

రెండేళ్ల క్రితం ఆమె చేసిన నిశ్శబ్దం మూవీలోనూ వెయిట్ అలాగే ఉంది. దాని తరువాత మరే మూవీ చేయలేదు. అయితే యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో అనుష్క హీరోయిన్ గా మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ నవీన్ పోలిశెట్టి బర్త్ డే వేళ యూవీ క్రియేషన్స్ నుంచి వచ్చింది.

దాంతో కొత్త ఏడాది ఈ సినిమా షూటింగ్ ఉంటుందని అంటున్నారు. మరి ఈ మూవీ కధాంశం బట్టి చూస్తే నలభయ్యేళ్ల ఒక ఆమెతో పాతికేళ్ళ యువకుడు సాగించే ప్రేమాయణంగా ఉంటుందిట. మరి ఈ మూవీలో అనుష్క ఎలా కనిపిస్తుంది అన్నదే ఇపుడు ఫ్యాన్స్ లో చర్చగా ఉంది. అనుష్క వెయిట్ లాస్ అయిందా. ఇదివరకులా సన్నగా కనిపిస్తుందా అన్న ఆలోచనల్లో ఫ్యాన్స్ ఉన్నారు.

అయితే ఈ మూవీ కధ ప్రకారం చూస్తే అనుష్క తన ఒరిజినల్ గెటప్ తో ఉన్నా సరిపోతుంది అంటున్నారు. అంటే అనుష్క లావుగా కనిపిస్తూనే కామెడీ టచ్ తో హీరో తో రోమాన్స్ పండిస్తుంది అని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే అనుష్క రెండేళ్ళుగా మూవీ చేయలేదు. దాంతో ఆమె కొత్త సినిమా మీద నాచురల్ గానే ఆసక్తి అంతటా ఉంది. పైగా నవీన్ జాతి రత్నాలు తరువాత హీరోగా తన మార్క్ చాటుకున్నాడు. ఈ ఇద్దరినీ పెట్టి సినిమా తీస్తున్నది యూవీ క్రియేషన్స్ బ్యానర్.

దాంతో అంచనాలు అయితే బాగానే ఉన్నాయి. అయితే అనుష్క ఏ మాత్రం వెయిట్ లాస్ అయి ఈ మూవీలో కనిపిస్తే యమ క్రేజ్ రావడం ఖాయం. అంతే కాదు ఆమెకు మరిన్ని అవకాశాలు కూడా రావడం ష్యూర్ అంటున్నారు. అనుష్క అయితే వెయిట్ లాస్ మీదనే ఇన్నాళ్ళూ దృష్టి పెట్టిందని దాంతో సరికొత్త అనుష్కనే ఈ మూవీలో చూస్తారని సినీ వర్గాల టాక్. సో అనుష్క ఎలా ఉంటుందో అన్న ఆలోచనలే ఈ మూవీకి అసలైన క్రేజ్ అంటున్నారు.


Recent Random Post: