టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ లేదని చెప్పను: అనుష్క

‘క్యాస్టింగ్ కౌచ్ ఒక్క సినీ పరిశ్రమలోనే కాదు.. ప్రతి రంగంలోనూ ఉంటుంది. నేనూ తొలినాళ్లలో దీని బారిన పడ్డాను. అయితే.. నాలోని ఖచ్చితత్వం, నిజాయితీ క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బంది పెట్టలేదు. నేను సినీ రంగంలో రాణించుంకు కష్టమైన మార్గాన్నే ఎంచుకున్నాను. ఇటువంటి వాటికి మహిళలు ‘నో’ చెప్తేనే పురుషుల నుంచి గౌరవం దక్కుతుంది’ అని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క చెప్పుకొచ్చింది. క్యాస్టింగ్ కౌచ్ పై తన అభిప్రాయాలను వెలిబుచ్చిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసింది.

‘అమ్మాయి ఇష్టాఇష్టాలు ఆమె వ్యక్తిగతం. వాటిని అడగడం కూడా తప్పే. అమ్మాయిలకు ఈజీ వే.. టఫెస్ట్ వే ఉంటాయి. వాటిలో కష్టమైన దారిని ఎంచుకుని వారి లక్ష్యాన్ని చేరుకోవాలి. గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టే సినీ రంగంపై ఎక్కువగా ఇటువంటి వార్తలు వస్తూంటాయి. అమ్మాయిలు జాగ్రత్తగా అడుగులు వేయాలి’ అని తన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది స్వీటీ.


Recent Random Post: