అనుష్క మూవీ కోసం మరింత కాలం వెయిటింగ్ తప్పదా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి తర్వాత అనుష్క పాన్ ఇండియా రేంజ్ లో వరుసగా సినిమాల్లో నటిస్తుందని అభిమానులు భావించగా కొన్ని కారణాల వల్ల ఆమె సినిమాలు చేయడమే గగనంగా మారింది. భాగమతి మరియు నిశబ్దం సినిమాల ఫలితాలు బెడిసి కొట్టినా కూడా ఈమెను మాత్రం ఇంకా టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ గానే ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు భావిస్తున్నారు. ఇప్పుడు ఈమె లేడీ ఓరియంటెడ్ చేసేందుకు సిద్దం అయినా మినిమంగా ఉన్నా కూడా కోట్ల వసూళ్లు కురుస్తాయి. అనుష్క రేంజ్ అలాంటిది.

అలాంటి అనుష్క చాలా సమయం వృదా చేస్తుంది. గత ఏడాది నిశబ్దం సినిమా తో వచ్చిన అనుష్క దాదాపు రెండేళ్లుగా కెమెరా కు పూర్తిగా దూరంగా ఉంటుంది. కరోనా వల్ల కొన్నాళ్లు సరే అనుకున్నా కూడా అందరు స్టార్స్ సినిమా లు చేస్తున్నా కూడా ఈమె మాత్రం సినిమా లకు కనీసం కమిట్ అవుతున్నట్లుగా కూడా వార్తలు రావడం లేదు. ఆ మద్య యూవీ క్రియేషన్స్ లో ఒక సినిమా ను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఆ సినిమా ఏదో కారణం గా షూటింగ్ మొదలు అవ్వడం లేదు. తాజాగా యూవీ వారి నుండి అందుతున్న సమాచారం ప్రకారం అనుష్క తో సినిమా తాత్కాలికంగా నిలిపి వేసినట్లుగా సమాచారం అందుతోంది.

అనుష్క తో యూవీ క్రియేషన్స్ వారు చేయబోతున్న సినిమా లో కూడా నవీన్ పొలిశెట్టి కూడా నటిస్తాడనే వార్తలు వచ్చాయి. వీరిద్దరి కాంబోలో సినిమా అంటే ఖచ్చితంగా ప్రేక్షకులకు మస్త్ ఎంటర్ టైన్ మెంట్ పక్కా అనుకున్నారు. కాని తాజాగా యూవీ క్రియేషన్స్ వారి నుండి అనధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా తాత్కాలికంగా అటకెక్కినట్లే అంటున్నారు. ఈ కాంబో అభిమానులు మరియు సినీ వర్గాల వారు కూడా ఈ వార్తలతో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అనుష్క ఈ సినిమా కనుక క్యాన్సిల్ అయితే ఆమె నుండి సినిమా కనీసం వచ్చే ఏడాది అయినా వచ్చేది కష్టమే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.


Recent Random Post: