మళ్లీ జబర్దస్త్‌ అనసూయ రాజకీయ ఎంట్రీ ప్రచారం

జబర్దస్త్‌ యాంకర్‌ గా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతూ వస్తున్న అనసూయ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతుంది అనేది కొత్తగా వస్తున్న వార్త. ఇలాంటి వార్తే గతంలో కూడా ప్రచారం జరిగింది. రెండు ప్రధాన పార్టీలు ఈమెను మా పార్టీలోకి రా అంటే మా పార్టీలోకి రా అంటూ ఒత్తిడి చేస్తున్నారని ప్రచారం జరిగింది. ఆ సమయంలో అనసూయ నుండి ఎలాంటి రియాక్షన్ అయితే కనిపించలేదు. మళ్లీ అనసూయ నుండి రాజకీయ ప్రకటన రాబోతుంది అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. రోజా స్వయంగా అనసూయను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తుందని అంటున్నారు.

జబర్దస్త్‌ అభిమానులతో పాటు అనసూయ వ్యక్తిగత అభిమానులు కూడా చాలా మంది రంగమ్మత్త రాజకీయాల్లోకి వస్తే కథ వేరే ఉంటుందని అంటున్నారు. అందుకే నువ్వు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలంటూ విజ్ఞప్తి చేస్తున్న వారి సంఖ్య చాలానే ఉంది. కాని అనసూయ ఆంతరంగం ఏంటీ అనేది క్లారిటీ లేదు. అనసూయ ఒక వేళ రాజకీయాల్లోకి వస్తే షర్మిల కొత్తగా పెట్టబోతున్న రాజకీయ పార్టీలో రోజా ప్రోత్సాహంతో చేరే అవకాశం ఉందని ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జబర్దస్త్‌ రాజకీయం ఎలా ఉంటుంది అనేది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Recent Random Post: