‘పుష్ప’ లో అనసూయ లుక్‌ లీక్‌

అల్లు అర్జున్‌, సుకుమార్‌ ల కాంబినేషన్‌లో రూపొందుతున్న పుష్ప సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. సినిమాకు సంబంధించిన స్టిల్స్ మొదటి నుండి లీక్ అవుతున్నాయి. తాజాగా అనసూయకు సంబంధించిన స్టిల్స్‌ లీక్ అవ్వడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అనసూయ ఈ సినిమాలో పొట్టు జట్టుతో విభిన్నమైన చీర కట్టులో కాస్త వయసు ఎక్కువ ఉన్న ఆంటీ పాత్రలో అనసూయ కనిపించబోతున్నట్లుగా ఈ లీక్‌ అయిన ఫొటోలను బట్టి అర్థం అవుతుంది.

అనసూయకు రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రను ఇచ్చిన సుకుమార్ ఆమెకు స్టార్‌ డమ్‌ తెచ్చి పెట్టాడు. ఇప్పుడు ఆమెకు పుష్పలో మరో కీలక పాత్రను ఇచ్చి ఆమె స్టార్ డమ్ ను మరింతగా పెంచినట్లు అవుతుంది. పుష్ప సినిమా లో అనసూయ రోల్‌ ఏంటీ అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సునీల్‌ కు వైఫ్‌ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటీ అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే పుష్ప సినిమా నుండి పాట విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.


Recent Random Post: