పుష్పలో జాయిన్ అయిన అనసూయ

జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ అటు యాంకరింగ్ తో పాటు ఇటు సినిమాలను కూడా మ్యానేజ్ చేస్తోన్న విషయం తెల్సిందే. కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తోన్న రంగమార్తాండ చిత్రంలో నటిస్తోన్న అనసూయ, మాస్ మహారాజా చిత్రం ఖిలాడీలో కూడా ఒక కీలక పాత్ర చేసింది. అలాగే వీటితో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్పలో కూడా కీ రోల్ చేస్తున్నట్లు సమాచారం.

సుకుమార్ ఈ చిత్రాన్నీ డైరెక్ట్ చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలోనే వచ్చిన రంగస్థలం అనసూయకు ఎంత పేరు తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరోసారి కథను మలుపుతిప్పే పాత్రలో అనసూయ కనిపించనుంది.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగులకు బ్రేకులు పడినా ఇప్పుడు తిరిగి మొదలయ్యాయి. అనసూయ పుష్ప షూటింగ్ లో ఈరోజు నుండి జాయిన్ అయింది. సికింద్రాబాద్ లో ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.


Recent Random Post: