అల్లు అర్జున్ పుష్పకు బాలీవుడ్ విలన్?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోన్న విషయం తెల్సిందే. సుకుమార్ – బన్నీ కాంబినేషన్ లో ఇప్పటికే ఆర్య, ఆర్య 2 సినిమాలు తెరకెక్కాయి. ఇది వారి హ్యాట్రిక్ కాంబినేషన్. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప ఉంటుందని, ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా నటిస్తాడని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో మొదట విలన్ గా విజయ్ సేతుపతిని నటింపజేయాలని భావించాడు సుకుమార్. అయితే డేట్స్ ఇష్యూ కారణంగా విజయ్ సేతుపతి ఈ సినిమా నుండి తప్పుకున్నారు. ఇక సుకుమార్ విలన్ వేట కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ను ఈ సినిమాలో విలన్ గా సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

రష్మీకి మందన్న పుష్పలో హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.


Recent Random Post: