‘డీజే’ జోడీ మళ్లీ రాబోతున్నారా?

అల్లు అర్జున్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన డీజే సినిమాలో హీరోయిన్‌ గా పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు ముందు పూజా హెగ్డే తెలుగు లో రెండు సినిమాలు చేసింది. కాని అవి పెద్దగా ఆకట్టుకోలేదు. కాని డీజే తో ఒక్కసారిగా ఈమె ఇమేజ్‌ మారిపోయింది. టాలీవుడ్‌ లో ప్రస్తుతం పూజా హెగ్డే టాప్ స్టార్ గా దూసుకు పోవడానికి కారణం ఖచ్చితంగా డీజే అనడంలో సందేహం లేదు. డీజే సినిమాలో ఈమె అందాల ఆరబోత మామూలుగా ఉండదు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ డీజే కాంబో రిపీట్ అవ్వబోతుంది.

ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్న అల్లు అర్జున్‌ ఆ తర్వాత ఐకాన్‌ సినిమాను చేయబోతున్నాడు. అల్లు అర్జున్ తో వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించబోతున్న ఐకాన్‌ సినిమా చిత్రీకరణ అక్టోబర్‌ లోనే ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐకాన్ స్క్రిప్ట్‌ వర్క్ ను ముగించిన దర్శకుడు ప్రస్తుతం హీరోయిన్‌ ఎంపిక విషయంలో చర్చలు జరుపుతున్నాడు. హీరోయిన్‌ గా ఐకాన్‌ కోసం డీజే బ్యూటీ పూజా హెగ్డే ను ఎంపిక చేయాలని భావిస్తున్నారట. అల్లు అర్జున్‌ కూడా ఆమె పట్ల సానుకూలంగా ఉన్నాడట. అందుకే డీజే కాంబో మళ్లీ రిపీట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.


Recent Random Post: