మెగాస్టార్ సాంగ్ కి ఐకాన్ స్టార్ రచ్చ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తోన్న చిత్రం పుష్ప. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తారని ప్రకటించినప్పుడు అంచనాలు మరింతగా పెరిగాయి. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. తొలి పార్ట్ దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని వినికిడి.

ఇదిలా ఉంటే పుష్ప గురించి ఒక ఆసక్తికర న్యూస్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సాంగ్ కు అల్లు అర్జున్ స్టెప్స్ వేసాడట. అయితే ఏదైనా సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నారా లేక ఒక సన్నివేశంలో సరదాగా స్టెప్పులు వేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.

పుష్ప చిత్ర ఫస్ట్ పార్ట్ ను ఆగస్ట్ లో విడుదల చేద్దామనుకున్నారు కానీ ఇప్పుడు అది సంక్రాంతికి మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే సెకండ్ పార్ట్ ను ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా 2022 సమ్మర్ లో విడుదల చేయనున్నారు.


Recent Random Post: