అల్లు అర్హ అరంగేట్రం.. శాకుంతలంలో భరతుడిగా

అల్లు అర్జున్‌ కూతురు అల్లు అర్హ సోషల్‌ మీడియాలో ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతటి గుర్తింపు ఉన్న అర్హ సినిమా ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. కొన్ని రోజుల క్రితం గుణశేఖర్‌ సినిమాలో ఈమె నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అన్నట్లుగానే అర్హ ను గుణశేఖర్‌ ఎంపిక చేశాడు అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. గుణశేఖర్‌ స్వయంగా తన శాకుంతలం సినిమాలో అర్హ నటిస్తున్నట్లుగా ప్రకటించాడు.

శాకుంతలం సినిమాలో భరతుడి చిన్నప్పటి పాత్రలో అంటే రాకుమారుడి పాత్రలో అర్హ కనిపించబోతుంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇలాంటి సమయంలో అర్హ కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం అవ్వడంతో ఇక అంచనాలకు హద్దు లేకుండా పోయింది అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ చక చక జరుగుతోంది. అతి త్వరలోనే షూటింగ్ కు గుమ్మడి కాయ కూడా కొట్టబోతున్నారు. అర్హ తో ఈ సినిమా కోసం వారం రోజుల పాటు షూటింగ్‌ చేస్తారని తెలుస్తోంది.


Recent Random Post: