అఖిల్ ప్లాప్ తో మహేష్ ప్రాజెక్ట్ అటకెక్కింది

స్టార్ హీరోలకు ఇమేజ్ చట్రం ఉంటుంది. దాన్నుండి బయటకు వచ్చి సినిమా చేయాలంటే చాలా కష్టం. ఒకవేళ ప్రయోగం చేయాలని అనుకున్నా కానీ ఫ్యాన్స్ నుండి సమ్మతం రావడం కష్టమే. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రయోగాలు చాలానే ఉన్నాయి. అయితే మహేష్ కు ప్రయోగాలు కలిసిరాలేదు. నాని, 1 నేనొక్కడినే, స్పైడర్ వంటి చిత్రాలు బెడిసికొట్టాయి.

ఇదిలా ఉంటే మహేష్ హీరోగా రచయిత వెలిగొండ శ్రీనివాస్ 100 కోట్ల బడ్జెట్ తో ఏలియన్ కాన్సెప్ట్ తో ఒక కథ సిద్ధం చేసాడట.అయితే ఈ సినిమా తెరకెక్కించాలంటే భారీ బడ్జెట్ తో మరో సినిమా ఏదైనా సక్సెస్ అయితే అప్పుడు చేయొచ్చని భావించారట.

కానీ వెలిగొండ శ్రీనివాస్ కథ అందించిన అఖిల్ సినిమా దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. అఖిల్ ఫలితం కారణంగా మహెష్ తో ఏలియన్ సబ్జెక్ట్ ను ముందుకు తీసుకెళ్లలేదని వెలిగొండ శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.


Recent Random Post: