అఖండ, పుష్పలు ఓటిటిలో వచ్చేది ఎప్పుడు?

డిసెంబర్ లో విడుదలైన అఖండ, పుష్ప చిత్రాలకు ఎవరూ ఊహించినంత లాంగ్ రన్ వచ్చింది. సాధారణంగా డిసెంబర్ మీద సినిమా వాళ్లకు అన్ని హోప్స్ ఉండవు కానీ అత్యధిక రెవిన్యూ ఈ ఏడాది వచ్చింది ఈ నెల నుండే. సాధారణంగా ఎంత మంచి టాక్ వచ్చినా కానీ సెకండ్ వీక్ కు చిత్రాలు కొంచెం స్లో అవుతుంటాయి కానీ ఈసారి అలాంటిది ఏం జరగలేదు.

అంచనాలకు మించి టాక్ కు భిన్నంగా ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆడుతున్నాయి. ఇదిలా ఉంటే పుష్ప, అఖండల ఓటిటి రిలీజ్ ఎప్పుడు అంటూ జనాల ఎంక్వయిరీలు ఎక్కువయ్యాయి. ఇక తాజా సమాచారం ప్రకారం పుష్ప జనవరి 7 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఆ రోజు నుండి ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ ఉంటుందని, ఆ మేరకు ఒప్పందం చేసుకున్నారు కానీ ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ వాయిదా పడింది. పుష్ప రన్ ఇంకా బాగానే ఉంది. కానీ ఓటిటి రిలీజ్ తప్పట్లేదు.

అఖండ జనవరి 14న హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవ్వడం మొదలవుతుంది.


Recent Random Post: