ఈ ఏడాది మాస్ హీరోలు రవితేజ, బాలయ్య

ఈ ఏడాది ముందు వరకూ అటు రవితేజ, ఇటు బాలకృష్ణ ఇద్దరి పరిస్థితీ ఏమంత ఆశాజనకంగా లేదు. ఇద్దరూ కూడా ఈ ఏడాది ముందు వరకూ సినిమా ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడ్డారు. అయితే ఈ ఏడాది ఇద్దరూ కూడా మాస్ హిట్స్ సాధించడం విశేషం. ఒకరు ఏడాది ప్రారంభంలో కొడితే మరొకరు ఏడాది చివర్లో సందడి చేసారు.

రవితేజ ఏడాది ప్రారంభంలో క్రాక్ చిత్రంతో సెన్సేషనల్ సక్సెస్ సాధించాడు. 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్నా కూడా క్రాక్ ట్రెమండస్ హిట్ సాధించింది. మాస్ కంబ్యాక్ ఇచ్చాడు రవితేజ. తర్వాత వరసగా సినిమాలతో బిజీ అయ్యాడు.

ఇక నందమూరి బాలకృష్ణ కూడా 2019లో హ్యాట్రిక్ ప్లాపులతో నెమ్మదించాడు. అయితే ఈ నెల ఆరంభంలో విడుదలైన అఖండ అన్ని ప్రాంతాల్లో కూడా విజయం అందుకుంది. ఈ లెక్కన రవితేజ, బాలకృష్ణ ఈ ఏడాది మాస్ హిట్స్ తో కంబ్యాక్ ఇచ్చారు.


Recent Random Post: