పుష్ప సినిమాలో ఐశ్వర్య రాజేష్‌

అల్లు అర్జున్‌, సుకుమార్‌ ల కాంబినేషన్‌లో రూపొందుతున్న పుష్ప సినిమాలో కీలక పాత్రను తెలుగు అమ్మాయి తమిళ స్టార్‌ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్‌ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. పుష్ప లో బన్నీకి ఐశ్వర్య రాజేష్‌ సోదరి పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఐశ్వర్య రాజేష్‌ నటిగా ఇప్పటికే మంచి గుర్తింపును దక్కించుకున్న విషయం తెల్సిందే. తెలుగులో ఈమె చేసిన పాత్రలు గతంలో సూపర్‌ సక్సెస్‌ అయ్యాయి. అందుకే పుష్పలో ఈమెను నటింపజేస్తున్నారు.

ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో ఐశ్వర్య రాజేష్‌ పాత్ర మద్యలో చనిపోతుందట. పుష్పరాజ్ తన సోదరి మృతికి ప్రతీకారంగా ఒక పోలీస్‌ ఆఫీసర్‌ ను చంపుతాడని కూడా అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా లో ఐశ్వర్య రాజేష్‌ కూడా నటిస్తుంది అనే వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ సినిమాపై అంచనాలు మరింతగా పెంచేస్తోంది.


Recent Random Post: