గుండె పోటు వార్తలపై క్లారిటీ ఇచ్చిన సీనియర్‌ హీరోయిన్‌

సీనియర్‌ హీరోలతో 1990ల్లో ఎక్కువగా నటించిన ఆమని ప్రస్తుతం సెకండ్‌ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈమద్య కాలంలో యంగ్‌ స్టార్‌ హీరోల సినిమాల్లో అమ్మగా అక్కగా అత్తగా నటిస్తున్న ఆమని ఇటీవల ఆసుపత్రి పాలయ్యింది అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె ఆరోగ్యం సరిగా లేదని అంటున్నారు. ఆమెకు హార్ట్‌ ఎటాక్ వచ్చిందని అందుకే ఆమె ఆసుపత్రిలో జాయిన్ అయ్యిందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె పుకార్లకు చెక్‌ పెట్టింది.

ఇటీవల ఒక షూటింగ్ నిమిత్తం మంచిర్యాల వెళ్లాం. అక్కడ తిన్న ఆహారం ఫుడ్ పాయిజన్‌ అయ్యింది. నాతో పాటు చిత్ర యూనిట్‌ లో దాదాపు 20 మందికి కూడా అనారోగ్యం అయ్యింది. అందుకే ఆసుపత్రికి వెళ్లాను తప్ప గుండె పోటు ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది. మీడియాలో గుండె పోటు అంటూ తీవ్ర అస్వస్థత అంటూ వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లుగా పేర్కొంది. కాస్త విచక్షణతో సోషల్‌ మీడియాలో ప్రచారం చేయాలని లేదంటే ఇతరుల వ్యక్తిగత జీవితాలు దెబ్బ తినే ప్రమాదం ఉందంటూ ఆమని సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసింది.


Recent Random Post: