ఆచార్య రిలీజ్ డేట్ వాయిదాపై ఫుల్ క్లారిటీ

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య చిత్ర రిలీజ్ డేట్ పై నిన్నటి నుండి రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఎల్లెందు మైనింగ్ ఏరియాలో జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడిందని, చిరంజీవికి డీహైడ్రేషన్ సమస్య రావడం వల్ల షూటింగ్ కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారని అన్నారు. అలాగే ఇప్పటికే ఆలస్యమైన ఆచార్య, మే 13న విడుదల చేయడం కుదరదని, అందువల్ల ఒక వారం వాయిదా పడే అవకాశం ఉన్నట్లు రూమర్లు గుప్పుమన్నాయి.

అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిసింది. స్వయంగా ఆచార్య నిర్మాతలు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఎల్లెందులో షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. చిరంజీవి, రామ్ చరణ్ ల కలయికలో షెడ్యూల్ ను పూర్తి చేసాం. ప్రస్తుతం టీమ్ అంతా హైదరాబాద్ చేరుకుంది. మే 13న ఆచార్య విడుదలవుతుంది అని అధికారికంగా ప్రకటించారు. రామ్ చరణ్ ఈ సినిమాలో ప్రముఖమైన పాత్రలో నటిస్తోన్న విషయం తెల్సిందే.


Recent Random Post: