ఆచార్య, ఆర్ ఆర్ ఆర్ కు మధ్య పోటీ తప్పదా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆచార్యలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. సిద్ధ పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తాడని అధికారికంగా వెల్లడైంది కూడా. నిన్నటి నుండి ఆచార్య షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొంటున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ ను జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేస్తారని ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఇప్పటికే ఆచార్య షూటింగ్ 50 శాతం మేర పూర్తయినట్లు తెలుస్తోంది.

ఇక మరోవైపు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా జనవరి 26న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించిన అప్డేట్ కోసం ఇరు హీరోల ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. స్వతంత్రం నేపథ్యంలో సాగే కథ కావడంతో జనవరి 26న కచ్చితంగా టీజర్ రిలీజ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఆ రోజు ఆచార్య వెర్సస్ ఆర్ ఆర్ ఆర్ క్లాష్ తప్పకపోవచ్చు.


Recent Random Post: