విజయ్ సేతుపతి రోల్ లో మన బన్నీ సెట్ అవుతాడా?

వేరే భాషల చిత్రాలు తెలుగులో రీమేక్ కావడం అనేది సాధారణంగా జరిగే విషయమే. తమిళ్ లో సూపర్ హిట్ సాధించిన ఓ మై కడవులే చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ ఓ మై కడవులే చిత్రంలో అశోక్ సెల్వన్, రితిక సింగ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ పాత్రల్లో తెలుగులో విశ్వక్ సేన్ మరియు మిథిలా పల్కర్ నటిస్తున్నారు.

ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పివిపి సినిమాస్, దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అల్లు అర్జున్ క్యామియో రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒరిజినల్ లో విజయ్ సేతుపతి చేసిన పాత్రను తెలుగులో అల్లు అర్జున్ చేయబోతున్నాడని సమాచారం. ఇప్పటికే బన్నీ రుద్రమదేవి చిత్రంలో స్పెషల్ రోల్ ను చేసాడు. ఇది తన కెరీర్ లో రెండోది.


Recent Random Post: