రెండ‌వ పెళ్లి పై నిహారిక అభిప్రాయ‌మిది!

మెగా డాటర్ నిహారిక జొన్నలగడ్డ మరియు చైతన్య వివాహం 2021లో జరిగింది. అయితే, రెండేళ్ల తర్వాత 2023లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ విషయంతో అప్పట్లో టాలీవుడ్‌లో భారీ షాక్ నెలకొంది. విడాకులకు గల కారణాలపై చైతన్య, నిహారిక ఇద్దరూ ఎక్కడా స్పందించలేదు.

ఈ నేపథ్యంలో తొలిసారి నిహారిక విడాకులపై స్పందించారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “పెళ్లి తర్వాత నేను సినిమాలు చేయలేదు. పెళ్లి చేసుకునే వల్లే సినిమాలు మానేసానని చాలా మంది అనుకున్నారు. మావదిన లావణ్యని కూడా ఇదే ప్రశ్న అడిగారు. అది మా వృత్తి. మేము ఎందుకు వదిలేస్తాం.

నిర్మాతగా బిజీగా ఉండటంతో నటనకు దూరమయ్యాను అంతే. కానీ పెళ్లి చేసుకునే ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి. అది తెలియకుండా మనకు సెట్ అవ్వని వ్యక్తిపై ఆధారపడకూడదు. వాళ్లు మన ఇంట్లో అమ్మ-నాన్నలా ఉండరు కదా. అంత ప్రేమగా అస్సలు చూసుకోలేరు. అందుకే ఎవరి మీద ఆధారపడకుండా ఒంటరిగా ఎలా ఉండాలో ఈ మధ్యే నేర్చుకున్నాను.

నాది పెద్దలు కుదిర్చిన సంబంధం. విడాకులు తీసుకున్న సమయంలో చాలా మాటలు అన్నారు. బాధ కలిగి ఏడ్చాను. అలాంటి వాటిని భరించడం అంత ఈజీ కాదు. ఎవరైనా జీవితంలో కలిసి ఉండాలనే పెళ్లి చేసుకుంటారు.

ఏడాదిలో విడిపోతామని తెలిసి ఎవరూ అంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోరు. కానీ ఏది అనుకున్నట్లు జరగదు కదా. నా గురించి రాసినా పట్టించుకునే దాన్ని కాదు. కానీ నా క్యారెక్టర్ ని తప్పు బట్టారు. నా కుటుంబాన్ని దూషించారు. అప్పుడు తట్టుకోలేకపోయాను. కానీ నా కుటుంబం నన్ను ఎప్పుడు బరువు అనుకోలేదు. ఈ రెండేళ్లలో కుటుంబం విలువ ఏంటో తెలిసింది.

పెళ్లి-విడాకుల తర్వాత ఎవర్నీ నమ్మకూడదని అర్థమైంది. ఇదొక గుణపాఠం. ఎప్పటికీ సింగిల్ గా ఉండిపోను. నాకు ఇంకా 30 ఏళ్లే. మంచి వ్యక్తి దొరికితే మళ్లీ పెళ్లి చేసుకుంటా.”


Recent Random Post: