రీరిలీజ్ తో బాక్సాఫీసును షేక్ చేస్తున్న టైటానిక్..!

టైటానిక్.. ఈ పేరు వినగానే మన అందరికీ గుర్తొచ్చే సీన్ పడవపై ప్రేమజంట నిలబడి ఉండడం. వెండితెరపై ఆవిష్కరించిన ఈ అద్భుతమైన ప్రేమ కావ్యం అంటే అందరికీ ఇష్టమే. భాషతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు. చారిత్రక రొమాంటిక్ అంశాల కలయికతో జేమ్స్ కామెరూన్ ఈ సినిమాను తెరకెక్కించారు. గతేడాది డిసెంబర్ తో ఈ సినిమా పాతికేళ్లు పూర్తి చేసుకుంది. ఐదు రోజుల క్రితం అంటే ఫిబ్రవరి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రీ రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే.

అయితే రీ రిలీజ్ లోనూ టైటానిక్ చిత్రం భారీ వసూళ్లను రాబడుతూ రికార్డులు సృష్టిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ప్రపంచ బాక్సాఫీసుపై సంచలనాలు నెలకొల్పుతుంది. ఎవర్ గ్రీన్ కల్ట్ క్లాసిక్ ను మళ్లీ థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఈ సినిమా స్పీడ్ చూస్తుంటే మరో రెండు వారాల వరకూ టైటానికి హవా కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

కేట్ విన్స్ లెట్ లియోనార్డో డికాప్రియో నటించిన ఈ చిత్రం డిసెంబర్ 19వ తేదీ 1997న విడుదల అయింది. ప్రపంచ వ్యాప్తంగా 13 వేల కోట్లకుపైగా కలెక్షన్లు సాధించి.. బిలియన్ డాలర్ మార్కు అందుకున్న మొదటి సినిమాగా సరికొత్త రికార్డు సృష్టించింది.

కలెక్షన్ల పరంగానే కాకుండా అవార్డుల పరంగానూ ఈ సినిమా పలు రికార్డులు సృష్టించింది. అప్పట్లో ఈ సినిమా ఏకంగా 11 ఆస్కార్ అవార్డులను గెలుచుకొని రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికీ అత్యధిక ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న రికార్డు టైటానిక్ పైనే ఉన్నాయి.

సినిమా మొదటిసారి రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది చాలా సార్లు ఈ సినిమాను టీవీలు ఫోన్లలో చూశారు. అయినా నేటికీ థియేటర్లలో రీ రిలీజ్ అయిందంటే ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం అవుతుంది.

ఇలాంటి ఎవర్ గ్రీన్ క్లాసికల్ మూవీ టైటానిక్ ను ఇంత గొప్పగా పొయెటిక్ గా జేమ్స్ కామెరూన్ తప్ప ఎవరూ తీయలేరు. ఈ సినిమాలో లియోనార్డో డికాప్రియో కేన్ విన్ స్లెట్ కెమిస్ట్రీకి మంత్ర ముగ్ధులు కానీ ప్రేక్షకులు ఉండరు.


Recent Random Post: