రాధికా ఆప్టేని కీర్తి సురేష్ త‌ట్టుకోగ‌ల‌దా?

రాధికా ఆప్టే పెర్పార్మెన్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌న్నివేశం డిమాండ్ చేసిందంటే? ఎంత‌టికైనా సై అంటుంది. న్యూడ్ స‌న్నివేశాల్లో సైతం న‌టించిన అనుభ‌వం ఆమె సొంతం. ఇక లిప్ లాక్ లు..బికినీ ..బెడ్ రూమ్ సీన్లు? అనేవి అమ్మ‌డికి న‌ల్లేరు మీద న‌డ‌క‌లాంటివి. అన్నింటిని ఎలాంటి డూప్ లేకుండా రియ‌లిస్టిక్ గా పండించ‌గల‌దు.

కెమెరా ముందు కావాల్సిన విధంగా మౌల్డ్ అయ్యే న‌టి రాధిక ఆప్టే. అందుకే బాలీవుడ్ లోనూ ఫేమ‌స్ అవ్వ‌గ‌లిగింది. ఎంత మంది న‌టులొచ్చినా? త‌న‌కి మాత్రం తానే పోటీగా భావించి దూసుకుపోతుంది. అలాంటి న‌టితో కీర్తి సురేష్ ఇప్పుడు పోటీ ప‌డాల్సిన స‌న్నివేశం ఎదుర‌వుతుందా? సీన్ డిమాండ్ చేస్తే రాధిక పోటీగా త‌గ్గేదేలే అంటుందా? అన్న‌ది వేచి చూడాలి. వివార‌ల్లోకి వెళ్తే..

ప్ర‌ఖ్యాత బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ `అక్కా` టైటిల్ తో మరో వెబ్ సిరీస్ కి రంగం సిద్దం చేస్తుంది. ఇదొక రివేంజ్ థ్రిల్ల‌ర్. ధ‌ర్మ‌రాజ్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ‌త ఆరు నెల‌లుగా టీమ్ ఈ ప్రాజెక్ట్ పైనే ప‌ని చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ల‌గా రాధికా ఆప్టే..కీర్తి సురేష్ ని తీసుకోవాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఇద్దర్ని ఇప్ప‌టికే సంప్ర‌దించిన‌ట్లు స‌మాచారం.

హీరోయిన్ రెండు పాత్ర‌లు పోటా పోటీగా ఉంటాయ‌ట‌. నువ్వా? నేనా? అన్న రేంజ్ లో సాగుతాయ‌ని చిత్ర వ‌ర్గాల నుంచి తెలుస్తోంది. రివేంజ్ థ్రిల్ల‌ర్ కావ‌డంతో కంటెంట్ ప‌రంగానూ బోల్డ్ గా వెళ్ల‌డానికి ఛాన్స్ ఉంది. మ‌రి అందుకు కీర్తి అంగీక‌రించిందా? లేదా? అన్న‌ది తెలియ‌దు గానీ ఆమె పేరు ప్ర‌ధానంగా హైలైట్ అవ్వ‌డంతో రాధికా ఆప్టేతో పోటీ ప‌డి న‌టించ‌గ‌ల‌దా? అన్న‌ది సందేహంగా మారింది.

ఎందుకంటే కీర్తి సురేష్ తొలి నుంచి గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగానే ఉంది. ఆ ర‌క‌మైన దూరం సినిమా అవ‌కాశాల్ని కూడా దూరం చేసింది. ఈ క్ర‌మంలోనే అమ్మ‌డు నిబంధ‌న‌లు కొన్నింటిని స‌వ‌రించింది. కొన్ని సినిమాల్లో స్కిన్ షో చేసింది. తాజాగా అక్కా సిరీస్ కోసం సిద్ద‌మైతే గ‌నుక అన్ని ర‌కాలుగా మౌల్డ్ అవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాధిక పోటీని త‌ట్టుకోవ‌డ‌మంటే క‌త్తి మీద స‌వాల్ లాంటిందే.


Recent Random Post: