మా అర్జునుడు ఉండగా పిడుగులు పడబోయేది లేదు


`మా అర్జునుడు ఉండగా పిడుగులు పడబోయేది లేదు.. భయపడేది లేదు“ .. ఈ థీమ్ లైన్ ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీలో మ్యాటరేంటో. ఇటీవల వరుసగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే మంచి హిట్లు కొడుతున్నాడు శ్రీవిష్ణు. ఇంతకుముందు బ్రోచేవారెవరురా ఆ కేటగిరీనే.

ఇప్పుడు `అర్జున ఫల్గుణ` అంటూ మరోసారి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. నేడు శ్రీవిష్ణు బర్త్ డే సందర్భంగా కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసారు. అర్జునుడు కోడి పుంజును పట్టుకుని బరిలో దిగాడు. చూస్తుంటే ఇందులో ఫన్ ఎలిమెంట్స్ కి కొదవేమీ ఉండదని అర్థమవుతోంది.

తనవారిని కాపాడుకునే అర్జున్ ..కి హ్యాపీ బర్త్ డే! అంటూ అర్జున్ టీమ్ ఈ పోస్టర్ ని రివీల్ చేసింది. తేజ మార్ని ఈ చిత్రానికి దర్శకుడు. అమృత.. ప్రియదర్శన్ తదితరులు నటిస్తున్నారు. ఇక కంటెంట్ పరంగా చూస్తుంటే నాని టక్ జగదీష్ లో విలేజీ కుర్రాడిగా స్టైలిష్ గా టక్ తో కనిపిస్తుంటే.. ఇక్కడ శ్రీవిష్ణు మాత్రం పూర్తి మాస్ లుక్ తో విలేజీ బాబులా కనిపిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అర్జున ఫల్గుణ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.


Recent Random Post: