భోళా శంకర్ కోసం ఈ హీరోనా.. ఊహించలేదు బాస్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ భోళా శంకర్. తమిళ్ హిట్ మూవీ వేదాళం రీ మేక్ గా ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తునన్నారు. కంటెంట్ ని మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్లుగా మార్పులు చేసి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని ప్రేక్షకులకి అందించేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే భోళా శంకర్ నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యాయి.

బాస్ లో ఒకప్పటి గ్రేస్ మరల భోళా శంకర్ లో కనిపిస్తుందనే మాట మెగా అభిమానుల నుంచి వినిపిస్తోంది. ఈ చిత్రంలో తమన్నా మెగాస్టార్ కి జోడీగా నటిస్తోంది. కీర్తి సురేష్ చెల్లెలు పాత్రలో కనిపించబోతోంది. అక్కినేని హీరో సుశాంత్ కీర్తి సురేష్ కి జోడీగా నటిస్తున్నాడు. మెగాస్టార్ లోని కామెడీ టచ్ ని ఈ మూవీలో మెహర్ రమేష్ పూర్తిగా వాడుకుంటున్నాడు. ఆగష్టు 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏజెంట్ లాంటి డిజాస్టర్ తర్వాత అని నుంచి రాబోతున్న మూవీ ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచింగ్ కి డేట్ ఫిక్స్ చేశారు. జులై 27న 4:05 గంటలకి ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ జరగబోతుందని చిత్ర యూనిట్ అధికారికంగా కన్ఫర్మ్ చేసింది.

తండ్రి సినిమాకి సంబందించిన ట్రైలర్ కొడుకు చేతుల మీదుగా రిలీజ్ చేయడం అంటే నిజంగా చెర్రీకి అది పెద్ద ఎచీవ్మెంట్ అని చెప్పాలి. కచ్చితంగా ఈ విషయాన్ని చరణ్ గర్వంగా చెప్పుకుంటారు. మెగా అభిమానులు కూడా ఈ సినిమా కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి అందరిలో నెలకొంది. రీమేక్ మూవీ అయిన కూడా మెగాస్టార్ బ్రాండ్ పడిన తర్వాత ఆ కథ షేప్ పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు భోళా శంకర్ కి కూడా అదే క్రేజ్ ఉంది.

ఈ మూవీకి మహత్ స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. మణిశర్మ తరహాలోనే ఇప్పుడు అతని కొడుకు కూడా మెగాస్టార్ కి భోళా శంకర్ తో బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారని చెప్పాలి. వాల్తేర్ వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి ఆరు నెలల గ్యాప్ లోనే భోళా శంకర్ రావడం నిజంగా విశేషమని చెప్పాలి.


Recent Random Post: