ప్రియాంక చోప్రా తల్లిగా సమంత?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. తెలుగులో ‘ఖుషి’ సహా పలు చిత్రాలను చేస్తోన్న ఈ భామ.. ఇవి మాత్రమే కాకుండా బాలీవుడ్లోనూ తెగ సందడి చేస్తోంది. అక్కడ కూడా వరుసగా ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇందులో భాగంగానే సామ్ ఇప్పుడు హిందీలో ‘సీటాడెల్’ అనే వెబ్ సిరీస్లో నటిస్తోన్న విషయం తెలిసిందే.

సమంత రూత్ ప్రభు వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలను పోషిస్తోన్న ‘సీటాడెల్’ వెబ్ సిరీస్ను రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తోన్నారు. దీని షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అదే సమయంలో ప్రియాంక చోప్రా లీడ్ రోల్ చేసిన ఇంగ్లీష్ వెర్షన్ ‘సీటాడెల్’ వెబ్ సిరీస్ మాత్రం ఏప్రిల్ 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే అక్కడ కొన్ని ఎపిసోడ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన ‘సీటాడెల్’ వెబ్ సిరీస్ ఐదో ఎపిసోడ్ స్ట్రీమింగ్ తర్వాత ఓ ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. ఇందులో పీసీ తన తండ్రిని పిలిచినప్పుడు వరుణ్ ధావన్ వాయిస్ వినిపించింది. దీంతో ప్రియాంక చోప్రాకు అతడు తండ్రి అవుతాడని హిందీ సిరీస్కు దీనికి లింక్ కూడా ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతోన్నాయి.

ఈ క్రమంలోనే ఓ సరికొత్త విషయం బాలీవుడ్ వర్గాల్లో బాగా ప్రచారం అవుతోంది. దీని ప్రకారం.. హిందీ ‘సీటాడెల్’.. ఇంగ్లీష్ ‘సీటాడెల్’ సిరీస్కు ప్రీక్వెల్గా వస్తుందనేదే దాని సారాంశం. అంతేకాదు సమంత వరుణ్ ధావన్.. ప్రియాంకకు తల్లిదండ్రులుగా కనిపిస్తారని అంటున్నారు. ఈ విషయాన్ని ఇంగ్లీష్ సిరీస్ చివరి ఎపిసోడ్లో రివీల్ చేసే అవకాశం ఉందని సమాచారం.

హిందీ వెర్షన్ ‘సీటాడెల్’ వెబ్ సిరీస్కు సంబంధించిన మరింత సమాచారం కూడా బయటకు వచ్చింది. ఇది 1990 దశకం నాటి కథతో వచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఇందులో సమంత వరుణ్ ధావన్ అప్పటి జనరేషన్ కపుల్స్లానే కనిపించబోతున్నారని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ రెండు సిరీస్లకు లింక్ పెట్టడంతో హిందీ వెర్షన్పై అంచనాలు ఏర్పడ్డాయి.


Recent Random Post: