ప్రభాస్ అంటే క్రష్‌.. విజయ్‌ ఆ సినిమాలు నచ్చలేదు!

తెలుగు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కేవలం క్రీడాకారిణిగా మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో హీరోయిన్ స్థాయి పాపులారిటీని సొంతం చేసుకుంది. తాజాగా టాలీవుడ్ హీరోలపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచింది.

ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సింధు, ప్రభాస్ అంటే తనకు క్రష్ అని చెప్పుకుంది. గతంలోనూ తనకు ప్రభాస్ అంటే ఎంతో అభిమానం అని పేర్కొన్న సింధు, ఈసారి కూడా అదే తరహా వ్యాఖ్యలు చేసింది.

విజయ్ దేవరకొండ నటించిన కొన్ని సినిమాలు తనకు నచ్చలేదని సింధు చెప్పుకొచ్చింది. అయితే, ఆ సినిమాలు ఏంటి అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఆ సినిమాలు నాకు నచ్చకపోయినా, ఇతరులకు నచ్చి ఉండవచ్చని, ఇప్పుడు వాటి గురించి మాట్లాడితే వివాదాస్పదం అవుతుందని ఆమె అభిప్రాయపడింది.

ఆటతో అలసిపోయినప్పుడు సినిమాలు చూసి రిలాక్స్ అవుతున్నానని సింధు తెలిపింది. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలు అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. సినిమా స్టార్స్ కూడా చాలా కష్టపడి సినిమాలు చేస్తారని, వారి సినిమాలు హిట్ అవుతాయా లేదా అనే టెన్షన్ ఉంటుందని ఆమె అర్థం చేసుకుంది.

గతంలో సింధు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఆ వార్తలను ఆమె మరోసారి ఖండించింది. తన బయోపిక్ తీస్తే బ్యాడ్మింటన్ తెలిసిన దీపికా పదుకునే నటిస్తే బాగుంటుందని సింధు అభిప్రాయపడింది.


Recent Random Post: