ప్రపంచ అందగత్తెల్లో టాప్-10 లో దీపిక పదుకొణే!

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. హిందీ పరిశ్రమని శాషిస్తోన్న హీరోయిన్. అం దాల ఐశ్వర్యా రాయ్ ఎగ్జిట్ అయిన తర్వాత ఆస్థానాన్ని దీపిక సొంతం చేసుకుంది. ఇద్దరు బెంగుళూరు దిగుమతైన బ్యూటీలే. ఐష్ తర్వాత అదే రేంజ్లో బాలీవుడ్ ని షేక్ చేస్తోన్న బ్యూటీగా దీపిక వెలిగిపోతుంది.

ఐశ్వర్యా రాయ్- అభిషేక్ బచ్చన్ ని పెళ్లడగా.. దీపిక పదుకొణే- రణవీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లాడింది. ముంబై భామలు ఎంత మంది ఉన్నా….సీనియర్లు ఎంత మంది పోటీగా ఉన్న దీపిక స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. హిందీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే హాలీవుడ్ లోనూ మెరుస్తోంది.

అందం..అభినయంతో ఇంగ్లీష్ ఆడియన్స్ ని సైతం ఫిదా చేస్తుంది. ఇప్పటికే పలు జాతీయ..అంతార్జాతీయ స్థాయిలో ఫేమస్ అయిన దీపక అందానికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే తొలి పదిమంది అందగత్తెల్లో ఒకరిగా స్థానం సంపాదించింది. `ది గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీఫై` అనే పేరుతో ఓ జాబితా రిలీజ్ అయింది.

లండన్ కు చెందిన ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ జులియన్ డిసిల్వా దీన్ని రూపొందించారు. సైంటిఫిక్ ప్రమాణాల ప్రకారం ప్రతీ ఏడాది లాగే 2022 ఏడాదికిగాను తన జాబితాను రిలీజ్ చేసారు. ఈ జాబితాలో దీపిక 91.22 శాతంతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో తొలి స్థానంలో జోడీ కామర్ నిలిచారు. శారీరక పరిపూర్ణతకు సంబంధించిన అన్ని అంశాల్లో జోడీ ముఖంలో ఉన్నాయని ఆమెకు మొదటి స్థానాన్ని కట్టబెట్టారు.

ఇంకా బియాన్స్.. ఆరియానా గ్రాండ్..టైలర్ స్విప్ట్..కిమ్ కర్దాషియన్ తదితర సుందరీ మణులు ఈజాబితాలో స్థానం సంపాదించారు. దీపిక ఈ సర్వేలో నిలవడం ఇదే మొదటిసారి. ఫ్యాషన్ వరల్డ్ లో ఇలాంటి స్థానాలు దీపికకి కొత్తేం కాదు. ఫ్యాషన్ ప్రియురాలిగతా ఎన్నో అవార్డులు..రివార్డులు సొంతం చేసుకుంది. ఇటీవల జరిగిన కేన్స్ ఉత్సవాల్లో దీపిక మెరిసిన సంగతి తెలిసిందే. దీపిక ఫ్యాషన్ ఎంపికలకు ప్రపంచమే దాసోహమైంది. డిజైనర్ దుస్తుల్లో జ్యూరీ సహా అందర్నీ అలరించింది.


Recent Random Post: