పెళ్లి గురించి ఇలియానా అప్పుడే హింట్ ఇచ్చిందా?

గోవా బ్యూటీ ఇలియానా గత కొంత కాలంగా తన అభిమానులతో పాటు అందరిని కూడా సస్పెన్స్ లో ఉంచింది. తాను గర్బంతో ఉన్న విషయాన్ని ప్రకటించింది కానీ.. తాను పెళ్లి చేసుకున్నాను లేదా తాను రిలేషన్ లో ఉన్నాను అనే విషయాన్ని వెళ్లడించలేదు. సరే గర్భం దాల్చింది కనుక రిలేషన్‌ లో ఉండి ఉంటుందని అనుకున్నా.. గత కొన్ని నెలలుగా ఇలియానా గురించి మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతూనే ఉంది.

ఇలియానా సోషల్‌ మీడియాలో తన బేబీ బంప్ తో కనిపించిన ప్రతి సారి కూడా ఆ బిడ్డకు తండ్రి ఎవరై ఉంటారు.. ఇలియానా తో ప్రేమలో ఉన్న ఆ వ్యక్తి ఎవరై ఉంటారు అంటూ అంతా మాట్లాడుకుంటూ ఉండగా ఇటీవల ఇలియానా తన ప్రియుడిని పరిచయం చేసింది.

అతడు ప్రియుడు మాత్రమే కాదు తన భర్త అని కూడా వెల్లడించింది. మే 13వ తారీకున ఇలియానా మైఖేల్‌ డోలన్ ను సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. పెళ్లి రోజు ఇలియానా సోషల్‌ మీడియాలో వైట్ డ్రెస్ తో ఉన్న ఒక ఫోటోను షేర్ చేసి తన పెళ్లి అన్నట్లుగా హింట్‌ ఇచ్చింది కానీ ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు.

ఆ రోజు పెళ్లి గురించి ఇలియానా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆమె పెళ్లి విషయం పై ఏ ఒక్కరు కూడా ఊహించలేకపోయారు. మొత్తానికి ఇలియానా వ్యవహారం కు తెర పడినట్లు అయింది. కొడుకుకు జన్మనిచ్చిన ఇలియానా హీరోయిన్‌ గా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది చూడాలి.


Recent Random Post: