నాటు నాటు డిబేట్: ఫ్రెండునే గెలిపించిన చరణ్

ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్న మొదటి ఆసియా పాటగా చరిత్ర సృష్టించిన గీతం ఏది? ఇది ఒక ప్రశ్న! కనీసం గ్రూప్ 4 లేదా డైట్ పరీక్ష విద్యార్థులకు ఇలాంటి ప్రశ్న ఎదురు కావొచ్చు. వెంటనే RRR ‘నాటు నాటు..’ను కాంపిటీటివ్ రాసే విద్యార్థులు జవాబుగా టిక్ చేయాల్సి ఉంటుంది. అంతగా ఇటీవలి కాలంలో నాటు నాటు .. మార్మోగుతోంది. గూగుల్ సెర్చ్ లో టాప్ సాంగ్ గా ఇప్పుడు నాటు నాటు.. మరోమారు ప్రపంచవ్యాప్త అభిమానుల వీక్షణతో దూసుకెళుతోంది.

అయితే ‘నాటు నాటు..’ క్రియేషన్ లో ఇంతటి విజయంలో గొప్ప క్రెడిట్ ఎవరికి దక్కుతుందనే దానిపై కొంతకాలంగా చర్చ సాగుతోంది. ఇదే విషయమై జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్ అభిమానులు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. చరణ్ ఫుల్ గ్రేస్ తో చేశాడని మెగా ఫ్యాన్స్ చెబుతుంటే.. తారక్ ఈ పాటను చాలా పర్ఫెక్ట్ గా చేశాడని నందమూరి అభిమానులు అంటున్నారు. ఒకరితో ఒకరు ఘర్షణ పడుతున్నారు.

అయితే ఈ ఘర్షణకు ఎండ్ కార్డ్ వేసేందుకు స్టార్లు దిగొచ్చారు. తాజాగా RRR డిబేట్ కి సంబంధించిన పోడ్ కాస్ట్ లో పాల్గొని చరణ్ క్లారిటీనిచ్చారు ఈ పోడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చరణ్ కి తారక్ కి మధ్య జరిగిన నాటు నాటు ఛాలెంజ్ లో ఎవరు గెలుస్తారని అడిగారు. చరణ్ బదులిస్తూ “అవును.. అతను (తారక్) సరైన స్టెప్పులేస్తాడని నేను అనుకుంటున్నాను. కానీ నాకు మరింత ఓర్పు ఉంది. ఇది ఇంకా ఎక్కువ కాలం కొనసాగవచ్చు. అతను (తారక్) సరైన స్టెప్పులేస్తాడని నేను భావిస్తున్నాను” అని ఛమత్కారంగా అన్నారు.

ఇది సరైనదే.. నాటు నాటు ఛాలెంజ్ లో భీమ్ నిజంగానే గెలిచి ఉండేవాడు! అని ఇంటర్వ్యూవర్ అన్నారు. నాటు నాటుపై చర్చకు చరణ్ తనదైన జవాబుతో అలా ఆసక్తికరంగా ముగింపు పలికారు. ఇది మెగాభిమానులకు ఎలా వినిపించినా కానీ తారక్ అభిమానులకు మాత్రం సంతృప్తినిచ్చే జవాబు. అయినా తన స్నేహితుడిని గెలిపించేందుకు ఎంతకైనా వెళ్లే వాడిగా ఆర్.ఆర్.ఆర్ లో కనిపించాడు చరణ్. ఓవైపు తన వృత్తి ధర్మాన్ని కాపాడుకుంటూనే స్నేహితుడి విషయంలో రగిలిపోయే పాత్రలో చరణ్ నటన మహదాద్భుతం. అందుకే ఇప్పుడు తారక్ తో పాటు చరణ్ కి గొప్ప పేరొచ్చింది. ఇది అభిమానులు గ్రహిస్తే అదే చాలు!


Recent Random Post: