నాగార్జున లెక్కలతోనే వెంకీ.. వ్వాటే ఐడియా

కింగ్ నాగార్జున ఎక్కువగా సంక్రాంతి సీజన్ లో సినిమాలు రిలీజ్ చేస్తూ సక్సెస్ లు అందుకుంటారు. నాగార్జున నుంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సంక్రాంతికి మూవీ వస్తుందనే గ్యారెంటీ హిట్ అనే అభిప్రాయం ఏర్పడిపోయింది. దీనికి కారణం అతని సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు, నా సామి రంగా సినిమాలు మూడు సంక్రాంతిలో వచ్చిన సూపర్ హిట్స్ కావడమే.

ఈ మూడు సినిమాల కామన్ పాయింట్ విలేజ్ బ్యాక్ డ్రాప్. అలాగే రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి కమర్షియల్ చిత్రాలుగానే మూడు సినిమాలు వచ్చాయి. నాగార్జునని ఎలాంటి పాత్రలలో ఆడియన్స్ చూడటానికి ఇష్టపడుతున్నారు అనేది ఈ సినిమాలతో స్పష్టం అయ్యింది. దీంతో వచ్చే ఏడాది కూడా బంగార్రాజు సీక్వెల్ కోసం కింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు నాగార్జున ఫార్ములాని వెంకటేష్ కూడా అనుసరిస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం వెంకీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. త్వరలోనే సినిమాకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని భావిస్తున్నారు.

జూన్ లేదా జులైలో మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారంట. ఇదిలా ఉంటే ఈ మూవీ కంప్లీట్ విలేజ్ బ్యాక్ స్టోరీతోనే అనిల్ రావిపూడి సిద్ధం చేస్తున్నారంట. ఈ మూవీలో కావాల్సినంత వినోదంతో పాటు కొన్ని స్పెషల్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాని టాక్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2, ఎఫ్3కి మించి నవ్వులని పంచే విధంగా సినిమా ఉండబోతుందని సమాచారం. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. దిల్ రాజుకి కూడా సంక్రాంతి సెంటిమెంట్ ఉంది.

అందుకే వెంకీ, అనిల్ చిత్రాన్ని సంక్రాంతి సీజన్ లోనే రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. సక్సెస్ కోసం వెంకీ కూడా కింగ్ నాగార్జున రూట్ లోకి వచ్చినట్లు అర్ధమవుతుంది. చాలా కాలం తరువాత గ్రామీణ వాతావరణంలోకి ఆడియన్స్ ని తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. విలేజ్ నేటివిటీ కథలకి సంక్రాంతి సమయంలో తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని చెప్పవచ్చు.

సంక్రాంతి అంటేనే పల్లె పండగ. సిటీలో ఉన్న ప్రజలందరూ సొంతూళ్లకి వెళ్ళిపోతారు. ఆ సమయంలో కుటుంబంతో కలిసి సినిమాలు చూడటానికి ఇష్టపడతారు. అందుకే విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీస్ ఎక్కువగా సంక్రాంతి సమయంలో వర్క్ అవుట్ అవుతూ ఉంటాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక ప్రస్తుతం వెంకీ మరో రెండు కథలపై కూడా చర్చలు జరుపుతున్నారు. వాటిపై కూడా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Recent Random Post: