నయన్ ఫ్యాన్స్ ను మళ్లీ కెలికిన ముద్దుగుమ్మ.. అయ్యో నేను అలా అనలేదు!

నయనతార ఒక సినిమాలోని యాక్సిడెంట్ సన్నివేశంలో ఫుల్ గా మేకప్ వేసుకుని నటించింది అంటూ హీరోయిన్ మాళవిక మోహనన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. మాళవిక డైరెక్ట్ గా పేరు పెట్టి నయనతారను విమర్శించలేదు. కానీ ఆమె చేసిన వ్యాఖ్యలు నయనతార గురించే అని చాలా మంది గుర్తించారు.

స్వయంగా నయనతార కూడా ఆ విషయమై స్పందించింది. తాను డైరెక్టర్ చెప్పినట్లుగా చేశాను.. అంతే తప్ప నా సొంతంగా ఏమీ చేయలేదు. కమర్షియల్ సినిమా కనుక యాక్సిడెంట్ సినిమా అయితే ఏంటీ మరేదైతే ఏంటీ అందంగా కనిపించాలని దర్శకుడు అన్నాడని నయనతార ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

మాళవిక మోహనన్ కి నయనతార గురించి మాట్లాడే స్థాయి లేదు అంటూ చాలా మంది ఆమెను తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా నయనతార అభిమానులు మాళవిక మోహనన్ తీరును తీవ్రంగా తప్పుబడుతూ కామెంట్స్ చేయడం జరిగింది. తాజాగా మరోసారి మాళవిక మోహనన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమా స్టార్స్ అంతా కూడా సూపర్ స్టార్స్.. ప్రత్యేకంగా లేడీ సూపర్ స్టార్ అంటూ పిలిపించుకోవాల్సిన అవసరం ఏంటీ అన్నట్లుగా నయనతారను ఇండైరెక్ట్ గా మాళవిక మోహనన్ కామెంట్ చేసింది. ఆలియా భట్.. దీపికా పదుకునేలా సూపర్ స్టార్స్ అయినా కూడా వారు లేడీ సూపర్ స్టార్స్ అని పిలిపించుకోవడం లేదు కదా అన్నట్లుగా మాళవిక మోహనన్ కామెంట్ చేసింది.

నయనతార ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను మాళవిక మోహనన్ వెంటనే వెనక్కు తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా నయన్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. సుదీర్ఘమైన సినీ అనుభవం ఉండటంతో పాటు ఎన్నో సూపర్ హిట్స్ లో నటించిన నయనతారను మాళవిక కామెంట్ చేసే స్థాయి కానే కాదు అంటూ వారు సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పించారు.

తనపై వస్తున్న విమర్శలకు వెంటనే మాళవిక మోహనన్ స్పందించింది. తాను నయనతార గురించి వ్యాఖ్యలు చేయలేదు అని.. కేవలం ఫీమేల్ స్టార్స్ గురించి మాట్లాడాను. హీరోయిన్స్ ను ప్రత్యేకంగా లేడీ సూపర్ స్టార్ అనాల్సిన అవసరం ఏంటీ అనే ఉద్దేశ్యంతో తాను మాట్లాడాను అంటూ ట్విట్టర్ ద్వారా తన వ్యాఖ్యలను సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది.


Recent Random Post: