డార్లింగ్ తో న‌టిస్తే హీరోయిన్ల‌కు బోన‌స్!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దేశ‌విదేశాల్లో ఫాలోయింగ్ ఉన్న న‌టుడు. ప్ర‌త్యేకంగా ఇండియాలో అయితే అసాధ‌ర‌మైన అభిమానుల్ని క‌లిగి ఉన్న స్టార్ అత‌ను. మ‌రి అలాంటి స్టార్ హీరోతో న‌టిస్తే హీరోయిన్ల‌కు ఆ ర‌క‌మైన ప్ర‌చారం బోన‌స్ లా క‌లిసొస్తుందా? అంటే అవున‌నే తెలుస్తోంది. ప్ర‌భాస్ ఇప్ప‌టివ‌ర‌కూ 23 సినిమాలు చేసాడు. అయితే వాటిలో కొన్ని సినిమాల్లో న‌టించిన హీరోయిన్ల విష‌యంలో డార్లింగ్ ఎఫైర్ నెరిపాడంటూ సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి.

‘వ‌ర్షం’ సినిమా త‌ర్వాత త్రిష‌తో క‌లిసి మ‌ళ్లీ ‘పౌర్ణ‌మి’ సినిమా చేసాడు. దీంతో ఆ సినిమా టైమ్ లో ఇద్ద‌రు ప్రేమించుకుంటున్నార‌నే ప్ర‌చారం సాగింది. కొన్ని ర‌కాల ఇంటిమేట్ స‌న్నివేశాల‌క‌లు ఆ ప్ర‌చారం మ‌రింత ఆజ్యం పోసింది. మ‌ళ్లీ అదే హీరోయిన్ ని ‘బుజ్జిగాడు’కి రిపీట్ చేసారు. అప్ప‌ట్లో సోష‌ల్ మీడియా లేదు కాబ‌ట్టి పెద్ద‌గా ఆ విష‌యం తెర‌పైకి రాలేదు. ఆ త‌ర్వాత బ‌లంగా వినిపించిన హీరోయిన్ పేరు అనుష్క. తొలిసారి ఇద్ద‌రు ‘బిల్లా’లో కలిసి న‌టించ‌డం..అందులో హాట్ హాట్ అనుష్క పెర్పార్మెన్స్ తో ఇద్ద‌రి మ‌ధ్య సింథింగ్ సంథింగ్ అనే ప్ర‌చారం సాగింది.

ఆ త‌ర్వాత మిర్చి..బాహుబ‌లి సినిమాల త‌ర్వాత ఏకంగా ఇద్ద‌రికీ సీక్రెట్ గా పెళ్లి కూడా అయిపోయింద‌ని ప్ర‌చారం సాగింది. ఇక డార్లింగ్ సినిమా టైమ్ లో బుజ్జిగాడు కాజ‌ల్ అగ‌ర్వాల్ ని ప్రేమిస్తున్నాడ‌నే ప్ర‌చారం ఏ రేంజ్ లో సాగిందో తెలిసిందే. పెళ్లి కూడా చేసుకుంటార‌నే ప్ర‌చారం చ‌క్క‌ర్లు కొట్టింది. ‘సాహో’ చేస్తోన్న స‌మ‌యంలో అందులో హీరోయిన్ శ్ర‌ద్దాక‌పూర్ తోనూ ప్రేమ పాఠాలు నెరిపిన‌ట్లు ప్ర‌చారం సాగింది.

ఆ త‌ర్వాత ‘ఆదిపురుష్’ లో న‌టించిన కృతిస‌న‌న్ తో డార్లింగ్ క‌నెక్ట్ అయ్యాడ‌నే వార్త‌లొచ్చాయి. తాజాగా ‘కల్కీ 2898’ లో న‌టిస్తోన్న దిశా ప‌టానీతో ప్లై అవుతోన్న ఓ వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌నే ప్ర‌చారం కొన్ని రోజులుగా జ‌రుగుతూనే ఉంది. ఇలా ప్ర‌భాస్ న‌టించిన హీరోయిన్లు అంద‌రి తోనూ వాళ్ల మ‌ధ్య ఏం లేక‌పోయినా! ఏఫైర్ అంటూ ప్ర‌చారం రావ‌డం హీరోయిన్ల‌కు మాత్రం బోన‌స్ గానే క‌లిసొచ్చింది.


Recent Random Post: