టీడీపీలోకి మంచు మనోజ్… ఆళ్ళగడ్డలో బిగ్ ట్విస్ట్

సినీ నటుడు, వెటరన్ యాక్టర్ మంచు మోహన్ బాబు రెండవ కుమారుడు అయిన మంచు మనోజ్ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని ప్రచారం గట్టిగా సాగుతోంది. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయి పసుపు కండువా కప్పుకుంటారు అని గట్టిగానే ప్రచారం సాగుతోంది.

మంచు మనోజ్ ఇటీవల మాజీ మంత్రి టీడీపీ మహిళా నాయకురాలు అయిన భూమా అఖిలప్రియ చెల్లెలు భూమా మౌనికారెడ్డిని రెండవ వివాహం చేసుకున్నారు. ఇక మంచు మనోజ్ కి రాజకీయాల్లోకి రావాలని ఉంది అని చాలా కాలంగా ప్రచారం ఉంది. అయితే ఆయన భార్య మౌనికా రెడ్డి కోసమే ఆయన రాజకీయాల మీద ఆసక్తిని చూపిస్తున్నారు అని అంటున్నారు.

అఖిలప్రియ ప్లేస్ లో ఆళ్ళగడ్డలో 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున మౌనికా రెడ్డి బరిలో నిలబడతారు అని అప్పట్లోనే గాసిప్స్ వినిపించాయి. ఇక చూస్తే మాజీ మంత్రి అఖిలప్రియ పొలిటికల్ గా కొన్ని ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు. టీడీపీ ఆమెను ఆళ్ళగడ్డకు ఇంచార్జిగా నియమించినా పార్టీ గ్రాఫ్ పెరగలేదు. అదే విధంగా ఆమె నంద్యాల సీటు విషయంలో కూడా తలదూర్చడంతో అక్కడ ఉన్న టీడీపీ నేతలు ఏవీ సుబ్బారెడ్డి, అలాగే ఆమె కజిన్ భొమా బ్రహ్మానందరెడ్డి వంటి వారితో కూడా విభేదాలు పెరిగాయి.

ఇక ఆళ్ళగడ్డలో బీజేపీలో ఉన్న ఆమె మరో కజిన్ భూమా కిశోర్ పెర్ఫార్మెన్స్ కూడా బాగా ఉందని అంటున్నారు తప్ప టీడీపీ అనుకున్న తీరులో పుంజుకోవడంలేదు అని అంటున్నారు. దీంతో పాటు అఖిలప్రియ అనవసర దూకుడుతో వివాదాలు కోరి తెచ్చుకుంటున్నారు అని పార్టీ భావనగా ఉంది.

సరిగ్గా ఈ టైం లో అక్క మీద చెల్లెలు పోటీగా మారి ఆళ్లగడ్డలో టీడీపీ టికెట్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆమెకు అండగా మనోజ్ ఉన్నారు. ఇక చంద్రబాబు కుటుంబంతో మంచు మోహన్ బాబు కుటుంబానికి మంచి పరిచయాలు ఉన్నాయి. దీంతోనే మంచు మనోజ్ బాబుకు కలవనున్నారు అని అంటున్నారు.

అంటే ఆళ్ళగడ్డ సీటుని తన భార్య మౌనికా రెడ్డికి ఇప్పించుకునేలా మనోజ్ పావులు కదుపుతున్నారని అంటున్నారు. మౌనికారెడ్డికి కూడా ఆళ్ళగడ్డ సొంత అడ్డా. రాజకీయంగా కూడా ఆమె గట్టిగానే నిలబడి ఉన్నారు. అక్క తరఫున ప్రచారం చేసిన అనుభవం ఉంది. ఇక మౌనికారెడ్డిని పోటీకి పెడితే మొత్తం భూమా అనుచరులు అంతా టర్న్ అవుతారని అది పార్టీకి లాభసాటిగా ఉంటుందని అంటున్నారు.

మరో రకమైన ప్రచారం ఏంటి అంటే మంచు మనోజ్ తానే స్వయంగా ఆళ్ళగడ్డ నుంచి పోటీ చేస్తారని. అయితే ఆళ్లగడ్డ అంటే భూమా ఫ్యామిలీకి ఒక ఇమేజ్ ఉన్న ప్రాంతం. అందువల్ల ఆ ఇంటి ఆడపడుచునే పోటీకి పెడితే విజయం సాధించడం ఖాయం. కాబట్టి మనోజ్ తాను వెనక ఉండి చక్రం తిప్పుతారు అని అంటున్నారు. ఏది ఏమైనా మంచు ఫ్యామిలీలో ఇపుడు మనోజ్ టీడీపీ వైపు అడుగులు వేయడం అతి పెద్ద న్యూస్ గా ఉంది.

ఎందుకంటే మంచు మోహన్ బాబు, ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు ఇద్దరూ కూడా వైసీపీలో ఉన్నారు. 2019 ఎన్నికల వేళ ఈ ఇద్దరూ ప్రచారాన్ని కూడా గట్టిగా నిర్వహించారు. ఈ రోజుకీ వైసీపీతో వారికి గుడ్ రిలేషన్స్ ఉన్నాయని అంటున్నారు. ఇపుడు అదే కుటుంబం నుంచి వచ్చిన మనోజ్ ప్రత్యర్ధి పార్టీ టీడీపీలో చేరడం అంటే మంచు ఫ్యామిలీలో కూడా రాజకీయంగా మరో ట్విస్ట్ గానే అంతా చూస్తున్నారు


Recent Random Post:

Neethone Dance 2.0 – Full Promo | Super Star Round | Every Sat & Sun at 9 PM

April 25, 2024

Neethone Dance 2.0 – Full Promo | Super Star Round | Every Sat & Sun at 9 PM