ఏంటి, ఎన్టీఆర్ కు కొరటాల ఇంకా స్క్రిప్ట్ రాయలేదా?

రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా అగ్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. మిక్కిలినేని సుధాకర్ నిర్మాణంలో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది.

కొరటాల శివ ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. లాక్ డౌన్ సమయంలో అల్లు అర్జున్ తో సినిమా స్క్రిప్ట్ కోసం పనిచేసాడు కొరటాల. మరి ఎన్టీఆర్ తో సినిమాకు స్క్రిప్ట్ ఎప్పుడు సిద్ధం చేసినట్లు? అల్లు అర్జున్ తో సినిమానే ఎన్టీఆర్ తో తీస్తున్నాడా అంటే అది కూడా లేదు. వచ్చే ఏడాది అల్లు అర్జున్ సినిమా కచ్చితంగా ఉంటుంది.

అసలు విషయం ఏమిటంటే కొరటాల శివ ఇంకా ఎన్టీఆర్ కోసం పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేయలేదు. కేవలం తన దగ్గర ఉన్న ఐడియాలలో ఒకదాన్ని ఎన్టీఆర్ కు చెప్పి ఒప్పించాడు. ఆచార్య పూర్తైన తర్వాత కొరటాల ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేయనున్నాడు.


Recent Random Post: