ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్న లూసిఫెర్ రీమేక్

మెగాస్టార్ చిరంజీవి మలయాళ చిత్ర లూసిఫెర్ హక్కులు కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. అయితే లూసిఫెర్ స్క్రిప్ట్ విషయంలో మొదటినుండి ఉన్న ఇబ్బందులు తొలగిపోలేదు. రెండేళ్ల క్రితం ఈ సినిమాకు సుజీత్ ను దర్శకుడిగా ఎన్నుకున్నారు.

దాని తర్వాత స్క్రిప్ట్ విషయంలో చిరు సంతృప్తి చెందకపోవడంతో సుజీత్ స్థానంలో వివి వినాయక్ వచ్చి చేరాడు. వినాయక్ కు చిరుతో మంచి ర్యాపో ఉంది. అయితే వినాయక్ అండ్ టీమ్ చేసిన మార్పులు చిరుని మెప్పించలేకపోయాయి. ఆరు నెలలకు పైగా వర్క్ చేసిన తర్వాత వినాయక్ కూడా లూసిఫెర్ రీమేక్ నుండి తప్పుకున్నాడు.

చివరిగా మోహన్ రాజాకు ఆ బాధ్యతలు అప్పగించాడు చిరు. మోహన్ రాజా చెప్పిన ప్రాధమిక డ్రాఫ్ట్ చిరంజీవి, చరణ్ లకు బాగా నచ్చాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఫైనల్ డ్రాఫ్ట్ లో మోహన్ రాజా వర్క్ పై చిరు పెదవి విరిచాడట.

చివరికి ఈ రీమేక్ ఎటు వెళ్తుందో చూడాలి.


Recent Random Post: