వెంకీ హిట్టు కాంబో.. పక్కా అనుకున్న టైమ్ లోనే..

విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది సైంధవ్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేదు. 2025 సంక్రాంతికి మాత్రం పక్కా బ్లాక్ బస్టర్ కొట్టే ప్లానింగ్ తో వెంకటేష్ రాబోతున్నారని తెలుస్తోంది. సూపర్ హిట్ సినిమాలతో స్టార్ కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడితో వెంకీ రెడీ అవుతున్నాడు.

గత ఏడాది భగవంత్ కేసరి మూవీతో బాలయ్యకి అనిల్ రావిపూడి సూపర్ హిట్ ఇచ్చారు. నెక్స్ట్ అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి సిద్ధం అవుతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఎఫ్2, ఎఫ్3 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ లుగా ఆ మూవీస్ రిలీజ్ అయ్యి ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించాయి. ఆ రెండు కూడా దిల్ రాజు నిర్మాణంలోనే తెరకెక్కడం విశేషం.

అనిల్ రావిపూడి దిల్ రాజు బ్యానర్ లోనే ఆరో సినిమాగా వెంకటేష్ మూవీ చేయబోతున్నారు. ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించబోతున్నారు. ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో భీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ గా టాప్ లోకి వచ్చారు. మాస్ ట్యూన్స్ తో భీమ్స్ ఇప్పటికే ఆడియన్స్ కి బలంగా చేరువ అయ్యారు. ఇప్పుడు అనిల్ రావిపూడితో జతకట్టే ఛాన్స్ భీమ్స్ సొంతం చేసుకున్నారు.

ఈ సారి అనిల్ రావిపూడి వెంకీమామ కోసం ఎక్స్ ట్రార్డినరీ ట్రైయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్ కథని ఎంచుకున్నారు. ఎక్స్ పోలీస్ ఆఫీసర్ గా వెంకటేష్ ఈ చిత్రంలో కనిపిస్తారంట. అలాగే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అందమైన భార్య మధ్యలో నడిచే ఎంటర్టైన్మెంట్ తో ఈ మూవీ కథాంశం ఉండబోతోందని అనిల్ రావిపూడి కన్ఫర్మ్ చేశారు. అనిల్ రావిపూడి నుంచి ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేసే కామెడీ ఎంటర్టైన్మెంట్ ఈ మూవీలో పుష్కలంగా ఉండబోతోందని తెలుస్తోంది.

జూన్ నెలలో ఈ మూవీ ఓపెనింగ్ ఉంటుందంట. అప్పటి నుంచే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఆరు నెలల్లో ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసి 2025 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లానింగ్ చేసుకుంటుంది. దిల్ రాజు బ్యానర్ లో చాలా ప్రాజెక్ట్స్ ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్నాయి. వాటిలో ఇదొక్కటే జెట్ స్పీడ్ లో ఫినిష్ అయ్యే అవకాశం ఉంది. అనిల్ రావిపూడి చెప్పిన టైంకి మూవీ పూర్తి చేసి రిలీజ్ చేస్తాడనే అభిప్రాయం ఉంది. అందుకే సంక్రాంతికి ఈ సినిమా థియేటర్స్ లోకి రావడం ఖాయం అనే మాట వినిపిస్తోంది.


Recent Random Post: