ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మే వరకూ నడుస్తుందా?

ఎస్ ఎస్ రాజమౌళి సినిమాలు అంటేనే చాలా ఆలస్యంగా తెరకెక్కుతాయి. అందుకే తనకు జక్కన్న అనే పేరుని కన్ఫర్మ్ చేసారు. సినిమాలను నెమ్మదిగా చెక్కే రాజమౌళి, బాహుబలి సినిమా కోసం దాదాపు ఆరేళ్ళు తీసుకుంటే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రానికి మూడేళ్లకు పైగా సమయాన్ని వెచ్చిస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఈ సినిమా షూటింగ్ నిజానికి మార్చ్ లోనే ముగుస్తుంది అనుకున్నారు. అయితే రామ్ చరణ్ మధ్యలో ఆచార్య సినిమా కోసం డేట్స్ ఇవ్వడం, ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులుతో బిజీగా మారనుండడంతో షూటింగ్ కొంత ఆలస్యం కానుంది. తాజా సమాచారం ప్రకారం మే కి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్న ఎన్టీఆర్ జూన్ నుండి షూటింగ్ ను మొదలుపెట్టబోతున్నాడు. అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది.


Recent Random Post: